నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) అమెరికా వ్యాప్తముగా చేస్తున్న మిలియన్
కాన్ ఫుడ్ డ్రైవ్ లో భాగంగా, నాట్స్ లాస్ ఏంజెల్స్ చాప్టర్ NTR వర్ధంతి
సందర్భముగా ఫుడ్ డ్రైవ్ జరిపి 2000 డాలర్స్ పైగా ఫుడ్ సప్లైస్ ని మూరుపార్క్
ఫుడ్ పాంట్రీ కి డొనేట్ చేయటం జరిగింది.

ఫుడ్ పాంట్రీ నిర్వాహకులు మాట్లాడుతూ
వారు చేస్తున్న ప్రోగ్రామ్స్ కొన్ని వందల కుటుంబములకు ఫుడ్ మరియు ఆర్ధిక
సహాయం అందిస్తున్నాయని చెప్పారు.నాట్స్ చేసిన ఈ సహాయం కొన్ని వందల
కుటుంబాలకు ఫుడ్ అందచేస్తుందని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న నాట్స్ సేవలు
అభినందనీయం అని అన్నారు.

నాట్స్ వైస్ ప్రెసిడెంట్ చందు నంగినేని మాట్లాడుతూ ఈ విన్నూత ప్రోగ్రాం ని
నాట్స్ అమెరికా వ్యాప్తముగా 11 సిటీస్‌లో చేపట్టినట్లు చెప్పారు.NRIs
స్వతహాగా స్వదేశమయిన ఇండియా లో అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నారని,
అలాగే తమకి ఎన్నో అవకాశాలు కలిపించిన అమెరికా లో కూడా ఇటువంటి సేవా
కార్యక్రమాలు చేయవలసిన ఆవశ్యకతని వివరిస్తూ, NRIs ని ఆ విధముగా
ప్రోత్సహించటానికి నాట్స్ ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు.

అన్ని
సిటీస్ లో NRIs ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి నాట్స్ చేపట్టిన ఈ
కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు చెప్పారు.రీజినల్ వైస్ ప్రెసిడెంట్
రామ్ కోడితాలా మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు NRIs ని అమెరికా లో
సాఫ్ట్వేర్ రంగంలోనే కాక సేవ రంగం లో కూడా ముందు వుంచుతాయని మరియు ఇక్కడే
పుట్టి పెరుగుతున్న పిల్లలకు సేవా భావాన్ని అలవాటు చేస్తున్నదని అన్నారు.

నాట్స్ లాస్ ఏంజెలెస్ చాఫ్టర్ సెక్రటరీ శ్రీనివాస్ చిలుకూరి మాట్లాడుతూ
ఇటువంటి మంచి ప్రోగ్రాం చెయ్యటానికి సహాయ సహకారాలు అందించిన దాతలకు మరియు
NATS LA చాప్టర్ మెంబెర్స్ కు మరియు వాలంటీర్స్ కి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇటువంటి
మరిన్ని విన్నూత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు, వాటికి కూడా ఇలానే సహాయ
సహకారములు అందించవలనని కోరారు.

ఈ కార్యక్రమములో ఇంకా నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్ మధు బోడపాటి, మనోహర్ మద్దినేని, సునీల్ పాతకమూరు, కిషొర్ గరికపాటి ,ఉదయ్ బొంతు, శ్రీనివాస్ సూరె, గౌరీ శంకర్, శరత్ పోపూరి , సాయిరాం బండారు, రామకృష్ణ జిల్లెళ్లమూడి ,కిషొర్ రామదేను, గిరిధర్ నక్కల, సాయి మగదల, శ్రీనివాస్ సంపంగి , కృష్ణ మద్దిలేటి తదితరులు పాల్గున్నారు.