దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని తెలుగుదేశం నాయకులు చక్కగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండటంతో వచ్చే ఎన్నికల్లో తమ రాజకీయ వారసులు రంగ ప్రవేశానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు.
ఇప్పటికే దానికి సంబంధించి కసరత్తు కూడా మొదలు పెట్టేశారు.దీనిలో భాగంగానే… తమ వారసులను ఆయా నియోజకవర్గాల్లో పర్యటనలు చేయిస్తూ… త్వరలో మీకు కాబోయే ఎమ్మెల్యే అంటూ ప్రచారం మొదలు పెట్టిస్తున్నారు.
ఈ విషయంలో మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా… టిడిపిలో మాత్రం ఎక్కువగానే ఉంది.తమ వారసులకు ఎలాగైనా సరే టిక్కెట్ ఇవ్వాలంటూ సీనియర్ నేతలు చంద్రబాబుపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు .ఇప్పటికే చంద్రబాబు నాయుడు లోకేష్ అలాగే మరికొంత మంది సీనియర్ నాయకులు వారసులు ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు.అందుకే మరి కొంతమంది నాయకులు కూడా కుమారులకు తమ కుమారులు ఇవ్వాల్సిందే పట్టుబడుతున్నారు.
తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు గా ఉన్న తండ్రులకు తల్లిదండ్రులు చేదోడువాదోడుగా ఉంటూ నియోజకవర్గంలో చాపకింద నీరులా వారసులు రాజకీయ చక్రం తిప్పుతూనే ఉన్నారు.
ఈ విధంగా చూసుకుంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలోనూ వారసులు టికెట్ల కోసం తీవ్రంగా… ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.ఇలా టికెట్ ఆశిస్తున్న ముఖ్య నాయకులను పరిగణలోకి తీసుకుంటే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన కుమారుడు పవన్ కి అసెంబ్లీ టికెట్ ఇప్పించాలని తీవ్రంగా ప్రయత్సిస్తున్నాడు.అలాగే… జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడికి కూడా టికెట్ ఇప్పించాలని కోరుతున్నాడు.
కర్నూలు జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు.అంతే కాకుండా… విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు కూడా ఈసారి తమ టిక్కెట్లను కుమారులకు ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు.ఇక బీకామ్ ఫిజిక్స్ ఎమ్యెల్యే గా పాపులర్ అయిన విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తమ కుమార్తెకు టికెట్ ఇవ్వాలంటూ ప్రతిపాదన పెట్టి దాన్ని ఒకే చేయించుకున్నట్టు తెలుస్తోంది.
శ్రీకాకుళంలో గౌతు శ్యామ్ సుందర్ కుమార్తె గౌతు శిరీష టికెట్ ను ఆశిస్తున్నారు.అలాగే అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్ నేత బోళ్ల బుల్లిరామయ్య మనవడు బోళ్ల రాజీవ్ ఏలూరు ఎంపీ సీటు కావాలంటూ… ఇప్పటికే ఖర్చీఫ్ వేశారు.
ప్రకాశం జిల్లాలోనూ ఇంతే.మాజీ మంత్రి కారణం బలరాం కుమారుడు వెంకటేష్, మంత్రి శిద్దా కుమారుడు సుధీర్ … ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లా నుంచి ఇద్దరు ముగ్గురు వారసులు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు తహతహలాడుతున్నారు.
.