Movie Title; అంతకు మించి
Cast & Crew:నటీనటులు: జై, రష్మీ గౌతమ్, అజయ్ ఘోష్, మధునందన్, హర్ష, టి.ఎన్.ఆర్ తదితరులుదర్శకత్వం: జానీనిర్మాత: జై, సతీష్, పద్మనాభరెడ్డిసంగీతం: సునీల్ కశ్యప్
STORY:
దయ్యాలు లేవు అని నిరూపించడానికి ఒక ఇంట్లో ఉండటానికి జై, రష్మీ లకు 5 కోట్ల రూపాయలు చెల్లిస్తారు.ఆ ఇంట్లో వారిద్దరూ కలిసి జీవిస్తూ ఉంటారు.ఈ క్రమంలో ఇద్దరు ప్రేమలో పడతారు.ఇద్దరి మధ్య రొమాన్స్.అంతబాగానే ఉంది అనుకున్న టైములో వాళ్ళ పై ఆ ఇంట్లో ఉండే దుష్టశక్తి ప్రభావం చూపిస్తుంది.ఎక్కడికి కదలనివ్వకుండా బంధిస్తుంది.చివరికి వారు ఆ ఇంటి నుండి ఎలా బయటపడ్డారు అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే!
REVIEW:
యాంకర్ గా అవతారమెత్తి అడపా దడపా హీరోయిన్ గా చేస్తున్న నటి రష్మీ గౌతమ్.గతంలోనూ హర్రర్ జోనర్లో వచ్చిన నెక్ట్స్ నువ్వేలో నటించిన రష్మీ, మరోసారి అలాంటి జోనర్ లో వస్తున్న అంతకు మించి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రష్మీ అందాల ఆరబోతపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుని సినిమా తెరకెక్కించారా అనేలా ఉంది ఈ సినిమా.‘అంతకు మించి’ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించారు రష్మి.‘సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు టీజర్, పోస్టర్స్‌ను గ్లామరస్‌గా చూపించారు.అయితే వీటిని చూసి ఈ సినిమాలో శృతిమించిన సన్నివేశాలు ఉంటాయనే అభిప్రాయానికి రావడం కరెక్ట్ కాదు.
నటనకు స్కోప్ ఉన్న సినిమా ‘అంతకు మించి’ అని చెప్పింది.కానీ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.
కథ కూడా రొటీన్ గా నే ఉంది.
Plus points:
రష్మీ గ్లామర్ట్విస్ట్
Minus points:
రష్మీ ని చూపించడంపైనే ద్రుష్టి పెట్టారు కానీ కథ, కథనంను పట్టించుకోలేదు సరిగా.
Final Verdict:
టైటిల్ కి తగ్గట్టుగానే ఇంతకముందు చూడని విధంగా “అంతకు మించి” అందాలు ఆరబోసింది “రష్మీ”.రష్మీ ఎక్సపోసింగ్ తప్ప సినిమాలో పెద్దగా ఏం లేదు.
Rating: 2 / 5