చిరంజీవిని ఘోరంగా అవమానించిన సీనియర్ దర్శకుడు

మెగాస్టార్ చిరంజీవి.ఈ బ్రాండ్ నేమ్ ని చెక్కిన ఘనత సీనియర్ దర్శకుడు కొదండరామిరెడ్డిది.

 Kodanda Rami Reddy Insults Chiranjeevi-TeluguStop.com

చిరంజీవి కెరీర్ ని తారాస్థాయికి తీసుకెళ్ళిన ఖైది చిత్రాన్ని తీసింది కొదండరామిరెడ్డే అని మనకు తెలిసిందే.ఆ తరువాత కూడా వీరిద్దరి కాంబినేషన్లో పసివాడు ప్రాణం, అభిలాష వంటి హిట్ చిత్రాలు వచ్చాయి.

ఒకప్పుడు ఉన్న సంబంధాలు ఇప్పుడు లేవేమో.చిరంజీవిని తీవ్రంగా అవమానించారు కోదండరామిరెడ్డి.

మీడియాలో మాట్లాడుతూ చిరంజీవి 150వ సినిమా టాపిక్ రాగానే ” అందరు అడుగుతున్నారు, చిరంజీవి 150వ సినిమా మీకొస్తే ఎలా తీస్తారు అని.యాక్షన్, లవ్, కామెడి ఉంటుంది.అతని బాడి అంత కామెడి ఉంటుంది.కామెడి బ్రహ్మాండంగా చేస్తాడు.అంతేకాని సందేశాలిస్తే ఇప్పుడు చూడరేమో అనిపిస్తోంది.ఇది చేస్తాని, అది చేస్తాను, రైతులకి అండగా ఉంటాను అని చిరంజీవి సందేశాలిస్తే నవ్వుతారేమో ” అంటూ సంచలన వాఖ్యలు చేసారు కొదండరామిరెడ్డి.

ఈ కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాలకి ఆశ్చర్యాన్ని కలిగిస్తే, మెగా ఫ్యాన్స్ కి మాత్రం కోపం తెప్పించాయి.ఇది చిరంజీవి మీద రాజకీయంగా దాడి చేయడానికి ఎవరో కావాలని చేయించిన వాఖ్యలని కొట్టిపారేశారు చిరంజీవి అభిమానులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube