ఏడాదిలో 70 హ‌త్య‌లు... వ‌ణుకు పుట్టించే హేమర్ కిల్లర్ కథ

డెబ్బై దశకంలో దేశంలో చోటుచేసుకున్న వ‌రుస హ‌త్య‌ను అంద‌రినీ వ‌ణికించాయి.ఆ ఏడాది భయానికి మారుపేరుగా నిలిచింద‌ని పెద్ద‌లు చెబుతుంటారు.

 70 Murders In A Year The Shocking Story Of The Hammer Killer , Killer, Hammer ,-TeluguStop.com

జ‌నం వీధుల్లోకి రావాలంటేనే భయప‌డిపోయారు.ఆ హంత‌కుడు ఒకరిద్దరిని కాదు ఏకంగా 70 మందిని పొట్ట‌న పెట్టుకున్నాడు.

కేవలం ఒక సంవత్సరంలో దేశంలోని ఈ అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్ 70 మందిని అత్యంత దారుణంగా హింసించి చంపాడు.రాజస్థాన్‌కు చెందిన సీరియల్ కిల్లర్ శంకరియాకు చంపడం అంటే వెన్న‌తో పెట్టిన విద్య‌లా మారింది.

శంకరియా 1952లో రాజస్థాన్‌లోని జైపూర్ నగరంలో జన్మించాడు.తల్లిదండ్రులు శంకరియాను చదివించారు.

కొంత‌కాలం త‌రువాత జైపూర్ నగరంలో ఓ సీరియల్ కిల్లర్ తిరుగుతున్నాడనే ప్రచారం మొదలైంది.ఈ సీరియల్ కిల్లర్ ఎవ‌ర‌నేది పెద్ద మిస్ట‌రీగా మారింది.

సూర్యుడు అస్తమించగానే రాజస్థాన్ ప్రజలు ఇంటినుంచి బ‌య‌ట‌కు రావ‌డం మానుకున్నారు.

సీరియ‌ల్ కిల్ల‌ర్‌ తదుపరి లక్ష్యం ఎవరో ఎవరికీ తెలిసేదికాదు.

దుప్పటితో ముసుగువేసుకుని హ‌త్య‌ల‌కు పాల్ప‌డేవాడు.ఈ సీరియల్ కిల్లర్ దాడి నుండి కొంత మంది ప్రాణాలతో బయటపడ్డారు.

దీంతో ఈ సీరియల్ కిల్లర్ గురించిన‌ కొన్ని విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి.ఈ సీరియల్ కిల్లర్ రాత్రిపూట వీధుల్లో దుప్పటి కప్పుకుని కూర్చునేవాడు.

ఎవరికీ కనిపించని విధంగా దుప్పటిలో దాక్కునే వాడ‌ని అత‌ని దాడి నుంచి బయటపడిన వారు చెప్పారు.దుప్పటి లోపల సుత్తిని దాచి ఉంచుకునేవాడు.

ఎవరైనా త‌న ఎదురుగా వెళ్లగానే సుత్తితో వారి త‌ల‌మీద కొట్టేవాడు.రాత్రి చీకటిగా ఉండటం వల్ల ఎవరూ అత‌నిని చూడ‌లేక‌పోయారు.అతను దాడి కోసం భారీ సుత్తిని వాడేవాడు.నిర్జన ప్రాంతాల్లోని ప్రజలను వేటాడేవాడు.

Telugu Murders, Jaipur, Killer, Rajasthan, Shankaria-Latest News - Telugu

రాష్ట్రంలో కొన్ని నెలల వ్య‌వ‌ధిలోనే పదుల సంఖ్యలో హత్యలు జరిగాయి.పోలీసులు తీవ్ర ఆందోళన చెందారు.వారికి కూడా ఏమి జ‌రుగుతున్న‌దీ అర్థం కాలేదు.1978 – 1979 మధ్య కాలంలో ఈ సీరియల్ కిల్లర్ చేతిలో 70 మంది చనిపోయారు.రాజ‌స్థాన్‌లో జ‌రిగిన ఈ ఘోరం దేశమంతటా సంచ‌ల‌నం రేపింది.ఎట్ట‌కేల‌కు ఈ కిల్లర్‌ని అరెస్ట్ చేసినప్పుడు అతని ముఖంలో భయం లేదని పోలీసులు తెలిపారు.అమాయకంగా కనిపించే 25 ఏళ్ల ఈ సీరియల్ కిల్లర్ ఈ 70 హత్యలను పిల్లల ఆటగా భావించాడు.శంకరియా అరెస్ట్‌ కావడంతో యావత్‌ దేశ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

దీనిపై కోర్టులో కేసు నమోదైంది.కోర్టు అతనికి మరణశిక్ష విధించింది.

సీరియల్ కిల్లర్ శంకరియాను 16 మే 1979న ఉరి తీశారు.ఉరి వేయడానికి కొద్దిసేపటి ముందు, శంక‌రియా నేను అనవసరంగా హత్యలు చేశాను, నాలా ఎవరూ ఉండకూడదు అని అన్నాడు.70 మందిని హ‌త్య‌చేసిన ఈ న‌ర‌రూప రాక్షసుడు తన చివరి రోజుల్లో తాను చేసిన పనులకు పశ్చాత్తాపపడ్డాడని అత‌ని ఆఖరి మాటలు చెబుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube