తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హైపర్ ఆది ఎక్కడ ఉంటే అక్కడ పంచుల వర్షం అని చెప్పవచ్చు.
ఏ షోకి వెళ్లిన అక్కడ షోలో జడ్జి నుంచి యాంకర్ వరకు ప్రతి ఒక్కరిపై తనదైన శైలిలో పంచులు వేసి ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు.అంతేకాకుండా ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై ఉన్న టాప్ కమెడియన్ లో ఒకరిగా దూసుకుపోతున్నాడు హైపర్ ఆది.ఒకవైపు బుల్లితెర పై నటిస్తూనే అప్పుడప్పుడు సినిమాలలో కూడా కనిపిస్తూ ఉంటాడు.ఇక ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, లతో పాటు పండగ ఈవెంట్లలో కూడా పాల్గొంటూ తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు.
ఇకపోతే ఈ మధ్యకాలంలో హైపర్ ఆది పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.మరి ముఖ్యంగా హైపర్ ఆది మితిమీరిన పంచులు వేయడంతో పాటు ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తున్నాడని, అలాగే షో కి పెద్ద సెలబ్రిటీ వచ్చిన వారిపై కూడా పంచులు వేయడం ఏమంత బాగోలేదని, జబర్దస్త్ లోని తన స్కిట్లో కూడా ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగులే ఉంటున్నాయి అని చాలామంది నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేయడంతో పాటు హైపర్ ఆది ప్రవర్తనపై కూడా మండిపడుతున్నారు.
మొన్నటికి మొన్న హైపర్ ఆది జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యరావు పట్ల ప్రవర్తించిన తీరిపై కూడా నెటిజెన్స్ మండిపడిన విషయం తెలిసిందే.

అమ్మాయిలు కనిపిస్తే చాలు హైపర్ ఆది రెచ్చిపోతుంటాడు అంటూ కామెంట్స్ కూడా చేశారు.ఇది ఇలా ఉంటే హైపర్ ఆది, పటాస్ కమెడియన్ సద్దాం ల మధ్య గత కొంతకాలంగా మాటల్లేవు అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇక సద్దాం ఒక స్కిట్లో భాగంగా ఈరోజు హైపర్ ఆది రేపు సద్దాం ట్రెండింగ్ లోకి వస్తాడు అంటూ పంచులు వేయడంతో హైపర్ ఆది తిరిగి కౌంటర్ ఇస్తూ స్కిట్స్ బీట్ చేయాలంటే అవి ఇవి అంటూ మిలియన్స్ లెక్కలు చెప్పాడు.
సినిమాలలో నాన్ బహుమతి రికార్డ్స్ ఎలాగో యూట్యూబ్లో హైపర్ ఆది రికార్డ్స్ కూడా అలాగే అని కౌంటర్ వేయడంతో అప్పటినుంచి వారి మధ్య మాటలు లేవని తెలుస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా వివిధ పార్టీ అనే ఒక ఈవెంట్లో సద్దాం అలాగే హైపర్ ఆది ఇద్దరు కలుసుకున్నారు.
అప్పుడు ఇదే స్టేజిపై సద్దాంకు తనకి మధ్య మనస్పర్ధలు కారణంగా దూరం పెరిగింది అని ఆది స్వయంగా చెప్పాడు.ఇక ఈ పార్టీలో వారిద్దరూ ఒక్కటయినట్టుగా తెలుస్తోంది.







