విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టనున్నాయి.ఇందులో భాగంగా డైరెక్టర్ల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చాయి.
ఈ మేరకు ఈనెల 25న స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ల నివాసాలను ముట్టడిస్తామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు.బిడ్ లో సెయిల్, ఎన్ఎండీసీ లేదా ప్రభుత్వ రంగ సంస్థలు పాల్గొనాలని డిమాండ్ చేస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐ గడువు మరో ఐదు రోజులు పెంచిన సంగతి తెలిసిందే.కాగా బిడ్ లు దాఖలు చేసేందుకు ఈనెల 20వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు పొడిగింపు అయింది.
అదేవిధంగా ఇప్పటివరకు 23 బిడ్లు దాఖలు కాగా వాటిలో జేఎస్ డబ్ల్యూ, జేఎస్పీఎల్ వంటి బడా కంపెనీలు ఉన్నాయి.ఇటు సింగరేణి సంస్థ బిడ్ వేయలేదని తెలుస్తోంది.