లోన్ కేసులో( Loan Case ) మోసం చేసినందుకు గాను న్యూజిలాండ్‌లో ( New Zealand ) స్థిరపడిన భారత సంతతికి చెందిన 41 ఏళ్ల ఉపాధ్యాయుడిని ముంబై పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని ఆర్ధిక నేరాల విభాగం (Economic Offences Wing) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసులో ఇప్పటికే 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.అనిల్ మారుతీ గైక్వాడ్ అనే టీచర్ నకిలీ పత్రాలను సమర్పించి జైపూర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ (ప్రస్తుతం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయబడింది) నుంచి కారు కోసం రుణం తీసుకున్నారు.
అయితే ఆ మొత్తంతో నిందితుడు ఎప్పుడూ కారును ( Car ) కొనుగోలు చేయలేదు.ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్‌ను భారతీయ స్టేట్ బ్యాంక్‌లో విలీనం చేస్తున్న సమయంలో అనిల్ మోసం వెలుగుచూసింది.
అంతేకాదు.కార్ లోన్ పేరిట ఇతను మరికొన్ని సంస్థలను కూడా మోసం చేసినట్లు తేలింది.అలా మొత్తంగా రూ.1.6 కోట్లను రాబట్టినట్లు పోలీసులు గుర్తించారు.

మహారాష్ట్రలోని కళ్యాణ్ ప్రాంతానికి చెందిన అనిల్.2014లో న్యూజిలాండ్‌కు వెళ్లాడు.ఆ దేశ పౌరసత్వం తీసుకునే ముందు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.2011లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ కల్బాదేవి బ్రాంచ్‌లో రూ.10 లక్షల కారు లోన్ తీసుకున్నాడు.అయితే ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు.నేరాన్ని గుర్తించి బ్యాంక్ అధికారులు అప్రమత్తమయ్యేలోపే.అనిల్ భారతదేశాన్ని విడిచి వెళ్లిపోవడంతో అతనిని అరెస్ట్ చేయడం సాధ్యం కాలేదు.ఇదిలావుండగా కోవిడ్ 19 సమయంలో అనిల్ గైక్వాడ్ న్యూజిలాండ్‌లో ఉద్యోగాన్ని కోల్పోయాడు.
దీంతో తన జీవనాన్ని కొనసాగించడానికి డ్రైవర్‌గా పనిచేయడం ప్రారంభించాడు.అయితే ఒక కుటుంబ సభ్యుడు మరణించడంతో ఇటీవల అనిల్ భారత్‌కు వచ్చాడు.

అయితే తాను బ్యాంక్‌ను మోసం చేసిన విషయం తెలిసిపోయిందని.తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు పోలీసులు అరెస్ట్ చేసేందుకు వెతుకుతున్నట్లు తెలుసుకున్న అనిల్ గైక్వాడ్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.అయితే కోర్టు అతని పిటిషన్‌ను కొట్టివేసింది.దీంతో చేసేదేం లేక అతను పోలీసులకు లొంగిపోయాడు.2013 డిసెంబర్‌లో స్టేట్ బ్యాంక్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ విలీన సమయంలో కల్బాదేవి బ్రాంచ్ మేనేజర్ బ్రిజేష్ జైన్.నకిలీ కారు లోన్ కేసులను గుర్తించారు.
దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా.అనిల్‌పై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.







