చిత్రం : కృష్ణార్జున యుద్ధంబ్యానర్ : షైన్ స్క్రీన్స్దర్శకత్వం : మేర్లపాక గాంధీనిర్మాతలు : సాహు గరపాటిసంగీతం : హిప్ హాప్ తమీజావిడుదల తేది : ఏప్రిల్ 14, 2018నటీనటులు : నాని, అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్ తదితరులు
కథలోకి వెళితే :
చిత్తూరు లో ఉండే కృష్ణ (నాని), దేశవిదేశాలు తిరిగి శ్రోతల్ని అలరించే రాక్ స్టార్ అర్జున్ (నాని) కి మధ్య ఎలాంటి రక్తసంబంధం లేకపోయినా, ఇద్దరు చూడ్డానికి అచ్చు గుద్దినట్టు ఒకేలా ఉంటారు.కృష్ణ రియాతో (రుక్సర్) తో ప్రేమలో పడితే, అర్జున్ సుబ్బలక్ష్మి (అనుపమ) కి మనసు ఇస్తాడు.
అంతా సవ్యంగా సాగుతోంది అనుకున్న తరుణంలో కథానాయికలు ఇద్దరు వారికి దూరమవుతారు.మరి ప్రేమని ఇద్దరు ఎలా తిరిగి దక్కించుకున్నారు, దానికోసం ఎలాంటి యుద్ధం చేసారు అనేది తెర మీదే చూడాలి.
నటీనటుల నటన :
నాని కృష్ణగా ఆకట్టుకుంటాడు.చిత్తురు యాసలో పండించిన కామెడి చాలాచోట్ల నవ్వు తెప్పిస్తుంది.కృష్ణ పాత్రలో ఉండే ఫక్తు అమాయకత్వం అందరికి కనెక్ట్ అవడం వలన ఆ పాత్ర ఉన్న సన్నివేశాలు బోర్ కొట్టించకుండా కదిలిపోతుంటాయి.ఇక సమస్య మొత్తం అర్జున్ పాత్రలోనే ఉంది.
నాని పెద్దగా ఆకట్టుకోకపోవడం పక్కన పెడితే, మొదట నాని రాక్ స్టార్ లా కనిపించట్లేదు.కాస్త క్లీన్ షేవ్ చేయించి, ఫంకీ లుక్ ట్రై చేసుంటే ఆ పాత్రకు సరిపోయేదేమో.
అనుపమ చేయడానికి పెద్దగా ఏమి లేదు.రుక్సర్ అందంగా ఉంది.
కామెడియన్స్ పర్లేదు.
టెక్నికల్ టీమ్ :
హిప్ హాప్ తమీజా సంగీతంలో ఒక్క దారి చూడు అనే పాట మాత్రమే జనాల్లోకి వెళ్ళింది.సహజంగా, నాని సినిమాల్లో ఓ మూడు పాటలైబా జనాల్లోకి వెళతాయి.ఇక నెపథ్య సంగీతం మరీ దారుణం.జరుగుతున్న సన్నివేశానికి, వెనకాల సంగీతానికి ఏమైనా సంబంధం ఉందా అని అనిపిస్తుంది ఒక్కోసారి.సినిమాటోగ్రఫీ బాగుంది.
ఎడిటింగ్ సెకండాఫ్ లో దారుణం.నిర్మాణ విలువలు బాగున్నాయి.
విశ్లేషణ :
ఫస్టాఫ్ అంతా నాని బలమైన కామెడితోనే లాగించేయాలని చూసారు.కృష్ణ పాత్ర వరకు అది వర్కవుట్ అయ్యింది.
కాని అర్జున్ పాత్రనే సరిగా రాయలేకపోయారు.అందులోనూ నానికి అస్సలు సరిపడని పాత్ర.
దాంతో కథ మీద పెద్దగా ఆసక్తి పుట్టకపోగా, సెకండాఫ్ లో ఎలాంటి మేధోమధనం (దర్శకుడి నుంచి) కనిపించకపోవటం వలన బోర్ డమ్ మొదలవుతుంది.ఇది ద్వితీయార్థం మొత్తం ఉండటం దురదృష్టం.
కొత్తగా కథ లేకపోగా, ఎందుకు వస్తున్నాయో అర్థం కాని పాటలు దాదాపుగా విసుగు తెప్పిస్తాయి.కృష్ణార్జునులు విలన్లపై తక్కువ, ప్రేక్షకుల తో ఎక్కువ యుద్ధం చేసారని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్ :
* కృష్ణ* కామెడి* ఫస్టాఫ్
మైనస్ పాయింట్స్ :
* కథ* అర్జున్* బలంగా లేని యాక్షన్ సన్నివేశాలు* సెకండాఫ్
చివరగా :
నాని అంటే ఇష్టం ఉంటే, ఇక మీ ఇష్టం.
రేటింగ్ : 2.5/5