ఒక చోట శత్రువే అయినా, మరోచోట మిత్రుడు అయ్యే విచిత్రమైన సంఘటనలు రాజకీయాలలో సర్వసాధారణంగా చోటు చేసుకుంటూ ఉంటాయి.ఇప్పుడు వైసీపీ, బీజేపీ విషయంలో అదే చోటుచేసుకుంది.
తిరుపతి ఉప ఎన్నికలలో ప్రధాన పోటీ అంతా బీజేపీ వైసీపీ మధ్య ఉంది.తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న, ఆ పార్టీ ప్రభావం అంతంతమాత్రంగానే ఉండడంతో, ఈ పరిస్థితి నెలకొంది.
బీజేపీ అగ్రనేతలతో తిరుపతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు తిరుపతి నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు.
ఈ విధంగా బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు, వైసీపీ అభ్యర్థిని ఓడించేందుకు ముమ్మర పయత్నాలే జరుగుతున్నాయి.ఇక బీజేపీ ఏపీ విషయంలో వ్యవహరించిన తీరు, ఏపీకి ప్రత్యేక హోదా తో పాటు, నిధులు విడుదల చేయకపోవడం, విభజన హామీలు ఇలా ఎన్నో అంశాలను వైసిపి లేవనెత్తి బిజెపిని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
ఇక్కడి వరకు ఈ రెండు పార్టీలు బద్ద శత్రువులుగానే వ్యవహరిస్తూ ఉండగా, పుదుచ్చేరి లో ఉన్న యానాం లో మాత్రం వైసిపి, బీజేపీలు స్నేహబంధం కొనసాగిస్తున్నాయి.బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు వైసిపి గట్టిగానే ప్రయత్నిస్తోంది.
యానంలో మల్లాడి కృష్ణారావు అనేక సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి గెలిచారు.కాంగ్రెస్ కు చెందిన ఆయన ఇటీవలే పార్టీకి రాజీనామా చేసి , అక్కడ ప్రభుత్వం కూలి పోవడానికి కారణం అయ్యారు.
ఆ సీటును బీజేపీ మిత్ర పక్షానికి త్యాగం చేయడంతో పుదుచ్చేరిలో అన్నాడీఎంకే, బిజెపి ,రంగస్వామి పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాయి రంగస్వామి మాజీ ముఖ్యమంత్రి, ఆయనే కూటమి అభ్యర్థి .ఇప్పుడు రంగస్వామి యానాం నుంచి పోటీ చేస్తున్నారు రంగస్వామి గెలుపుకోసం వైసీపీ నేతలంతా గట్టిగానే కృషి చేస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రులు , ఎమ్మెల్యేలు అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ రంగస్వామిని గెలిపించే బరువు బాధ్యతలను భుజాన వేసుకున్నారట.తిరుపతిలో శత్రువులుగా ఉన్న బీజేపీ వైసీపీ లు యానం కు వచ్చేసరికి ఉమ్మడిగా ముఖ్యమంత్రి అభ్యర్థిని గెలిపించేందుకు తాపత్రయ పడుతూ ఉండటం చర్చనీయాంశం గా మారింది.