Chiranjeevi Murugadoss : చిరంజీవి ఆఫర్ ఇచ్చిన కూడా దర్శకుడు మురుగదాస్ ఎందుకు చేయను అని చెప్పాడు ?

చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ సినిమా చిరంజీవి కెరియర్ లో ఒక్క పెద్ద హిట్ సినిమాగా మిగిలిపోయింది.అయితే ఠాగూర్ సినిమా దర్శకుడు వివి వినాయక్( Director VV Vinayak ) అని కూడా మన అందరికీ తెలుసు.

 Why Murugadas Rejected Chiranjeevi Offer-TeluguStop.com

లంచగొండితనం అనే విషయాన్ని ఆధారితంగా చేసుకొని ఈ సినిమా కథను రూపొందించారు.కానీ ఈ సినిమాను వినాయక్ దర్శకత్వం వహించడానికి ముందు చాలా జరిగిందట.2003లో వచ్చిన ఠాగూర్ సినిమా అంతకన్నా ముందు వచ్చిన తమిళ రమణ( Ramana ) అనే ఒక చిత్రానికి రీమేక్ గా తెలుగులో విడుదల అయింది.తమిళంలో ఈ సినిమాను విజయ్ కాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కించగా తెలుగులో కూడా మురగదాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేయాల్సింది.

కానీ చిరంజీవి అడిగినా కూడా మురుగదాస్( Murugadoss ) ఈ సినిమాను డైరెక్ట్ చేయకపోవడానికి గల అసలు కారణం ఇటీవలే బయటకు వచ్చింది.రమణ చిత్రం విజయ కాంత్ మెయిన్ లీడ్ గా కొనసాగుతుంది.

Telugu Chiranjeevi, Murugadoss, Ramana, Tagore, Vijaykanth-Movie

అయితే ఈ సినిమాలో పాటలు అసలే లేవు.పైగా క్లైమాక్స్ లో విజయ్ కాంత్( Vijaykanth ) ఉరిశిక్ష పడి మరణిస్తాడు.అయితే ఈ సబ్జెక్టు చిరంజీవి చాలా ముచ్చట పడి ఎంతో ఇష్టంగా రీమేక్ చేయాలని అనుకున్నాడు.అలాగే దర్శకుడుని కూడా సంప్రదించాడు.కానీ హీరో క్లైమాక్స్ లో చనిపోతే చిరంజీవి( Chiranjeevi ) అభిమానులు ఒప్పుకోరు కాబట్టి అలాగే పాటలు కూడా ఉండాలని మురగదాస్ ని అడగగా అందుకు ఆయన ఒప్పుకోలేదు.ఎంతో ఇష్టమైన తన సబ్జెక్టుని పాటల కోసం అలాగే క్లైమాక్స్ మార్చడానికి ఆయన అంగీకరించకపోవడంతో రీమేక్ హక్కులను అక్కడ నుంచి తీసుకొని తెలుగులో ఠాగూర్( Tagore ) పేరుతో చిత్రీకరించారు.

Telugu Chiranjeevi, Murugadoss, Ramana, Tagore, Vijaykanth-Movie

దాంతో పరుచూరి బ్రదర్స్( Paruchuri Brothers ) తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేయగా అలాగే పాటలను కూడా జొప్పించి వినాయక దర్శకత్వంలో ఈ సినిమాలు తీయగా తెలుగులో అతి పెద్ద విజయం సాధించింది.ఠాగూర్ సినిమాలో ఎన్నో సరికొత్త విశేషాలు ఉన్నాయి.ముఖ్యంగా పదాలు లేకుండ కేవలం సంగీతం మాత్రమే ఉండే ఒక పాట కోసం చిరంజీవి డ్యాన్స్ చేశారు.దీంట్లో స్టూడెంట్ పాత్రలో( Student Role ) దర్శకుడు వివి వినాయక్ సైతం కనిపిస్తాడు.

ఈ సినిమాకి ముందు వచ్చిన ఇంద్ర చిత్రంలో ఉన్న దాయి దాయి దామ్మా అనే పాట లోని వీణ స్టెప్ కి కొనసాగింపుగా మన్మధ మన్మధ అనే పాట లో డ్యాన్స్ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube