వైరల్ వీడియో: కనురెప్పపాటులో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న బాలిక..!

ఇంటి నుంచి రోడ్డు మీదికెళ్లాలంటే భయం.బయటకు వెళ్లినవారు క్షేమంగా తిరిగి ఇంటికి వస్తారన్న నమ్మకం లేదు.

 Viral Video The Girl Who Escaped From The Big Accident In The Eyelid, Shocking V-TeluguStop.com

కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకెళ్లాలంటే టెన్షన్.పుణ్యక్షేత్రాలనూ దర్శించుకుని వద్దామనుకుంటే ఏమవుతుందోనన్న భయం.పాఠశాలకు వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చేంతవరకు తల్లిదండ్రులలో ఆందోళన.కొత్తగా వాహనం నడప డం నేర్చుకోవాలంటే హడలే.

నల్లని రోడ్డు ఎర్రగా మారుతోంది.ఎదురుగా వస్తున్న వాహనాలు దెయ్యాల్లా కనిపిస్తున్నాయి.

వయస్సు తేడా లేకుండా చావు డప్పులు మోగిస్తున్నాయి.భారత్‌లో రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.

మితిమీరిన వేగం, హెల్మెట్ లేకపోవడం వంటి పలు కారణాలతో చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో అర్ధాంతరంగా ప్రాణాలు వదులుతున్నారు.మొత్తం ప్రమాదాల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు, లెర్నర్ లైసెన్స్ ఉన్నవారు వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే రహదారిపై వాహనాలు రయ్ రయ్ మంటూ వెళ్తున్నాయి.

గ్యాప్ లేకుండా వరుసగా కార్లు, బైక్‌లు దూసుకువెళ్తున్నాయి.ఇంతలో ఓ యువతి, ఓ వ్యక్తి వచ్చి రోడ్ దాటేందుకు సిద్ధంగా ఉన్నారు.అయితే వాహనాలు వరుసగా వస్తుండటంతో వేచి చూస్తున్నారు.అయితే రోడ్డు అవతలి వైపున ఓ వ్యక్తితో పాటు చిన్నారి కూడా ఉంది.

ఆ చిన్నారి అతని చేయి వదిలిపెట్టి రోడ్డుపై వస్తున్న బండ్లను చూసుకోకుండా ఒక్కసారిగా రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది.అప్పటకే ఓ కారు వేగంగా వస్తోంది.

ఇటు కారును, అటు చిన్నారి రాకను గమనించి రోడ్డుకు ఇవతలి వైపు ఉన్న వ్యక్తి ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్షణాల్లో పరుగెత్తి ఆ చిన్నారిని రక్షించాడు.కారు వారిని దాటిపోయింది.

సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురవకమానదు.అతనే గనుక అప్రమత్తంగా లేకుండా ఆ చిన్నారి పరిస్థితి ఎలా ఉండే ఊహిస్తేనే భయానకంగా ఉంది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారి హల్ చల్ చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube