మనం రోజూ నెట్టింట్లో చాలా రకాల వీడియోలు వైరల్ అవడం చూస్తుంటాం.కాని కొన్ని వీడియోలు మాత్రం ఔరా అనిపించేలా అదే విధంగా ఇది నిజంగా జరిగిందా అని మనలో మనకు అనుమానం వచ్చే విధంగా కొన్ని వీడియోలు ఉంటాయి.
కాని ఆ వీడియోను చూసిన తరువాత మనకు కొంత మేర నమ్మకం వస్తుంది.ఇక అసలు విషయంలోకి వెళ్తే చిలుకలు మనుషులలా మాట్లాడతాయి మనం మాటలు నేర్పిస్తే చిలుకలు మాట్లాడతాయి అనే ప్రచారం ఎప్పటి నుండో ఉంది.
కాని అవి ప్రచారాలు కాదు నిజం అన్నది మన కళ్ళ ముందు ఆ ప్రచారాన్ని ఖండిస్తూ ఉన్న వీడియో చూస్తే నిజం అని భావిస్తాం.చిలుక కొద్దిగా మాట్లాడటం మనం చూసాం.
కాని చిలుక పాటపడడం చూసామా అంటే అందరి దగ్గర నుండి లేదనే సమాధానం వస్తుంది.కాని చిలుకలు పాటలు పాడతాయి.
వాటికి కూడా పాటలు పాడే టాలెంట్ ఉంటుందని ఈ వీడియోలో చిలుక పాడిన అద్భుతమైన పాట ద్వారా నెటిజన్లకు అర్థమయింది.అమెరికన్ పాప్ సింగర్ బియోన్స్ పాటను పాడేసింది.
ఈ చిలుక పాట పాడుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇప్పటికే ఈ వీడియోను 56 లక్షల మంది వీక్షించారంటే నెటిజన్లకు ఈ వీడియో ఎంతలా నచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు.
నెటిజన్లను ఎంతో ఆసక్తికి గురి చేసిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.ఇంకెందుకు ఆలస్యం.
చూసేయండి మరి