వైరల్ పిక్: ఫోటోలోని చిన్నారి ఇప్పటి స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టడానికి ట్రై చేయండి..!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.తమ చిన్నప్పటి ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ గడిచిపోయిన బాల్యాన్ని తిరిగి గుర్తు చేసుకుంటున్నారు.

 Viral Pic Who Is The Star Heroine Looking As Child In This Viral Pic , Viral Lat-TeluguStop.com

అభిమానులు సైతం హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలను బాగా లైక్ చేస్తున్నారు.ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్స్ చిన్నపటి ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి.

తాజాగా ఇప్పుడు మరొక స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఈ చిన్నారి ఫోటోను చూసిన నెటిజన్లు అసలు ఆ హీరోయిన్ ఎవరబ్బా అనే అయోమయంలో పడిపోయారు.

ఈ చిన్నారి ఫోటోను ఒకసారి గమనిస్తే ఒంటి నిండా ఆభరణాలు ధరించి, ఎరుపు రంగు చీర కట్టుకుని చీర పైట కొంగుని తల మీద పెట్టుకుని అచ్చం ఒక బుజ్జి యువరాణిలా కనిపిస్తుంది కదా.

అయితే ఈ చిన్నారి ఎవరా అని గుర్తుపట్టడం కొంచెం కష్టం అయిన పనే అని నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారట.ఇంతకి ఈ ఫొటోలో కనిపించే హీరోయిన్ ఎవరో కాదండోయ్.మన తెలుగమ్మాయి అంజలి.సితమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది.అటు తెలుగు ఇటు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది.

నిజానికి ఒక తెలుగమ్మాయి సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగాలంటే అది మాములు విషయం కాదు.

Telugu Anjali, Child Hood, Instgram, Latest-Latest News - Telugu

కానీ అంజలి మాత్రం తన నటనతో, మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది.మొదట ‘ఫొటో‘ సినిమాతో తెలుగు వారికి పరిచయం అయ్యి ఆ తర్వాత షాపింగ్‌ మాల్‌, జర్నీ, గితాంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఎన్నో చిత్రాల్లో నటించింది.ఇందులో వెంకటేష్‌, బాలకృష్ణ, రవితేజ, అల్లు అర్జున్ వంటి హీరోల సరసన కూడా నటించే అవకాశం దక్కించుకుంది.

అయితే ఒకానొక సమయంలో కొన్ని కారణాల వలన సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది.మళ్ళీ గ్యాప్ తరువాత ‘ పవన్‌ కల్యాణ్‌ ‘ నటించిన వకిల్‌ సాబ్‌ సినిమాలో జరీనా పాత్రతో మన ముందుకు వచ్చి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది.

ప్రస్తుతం వరుస సినిమాలతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ముందుకు దూసుకుని వెళుతుంది అంజలి.ప్రస్తుతం సినిమా అవకాశాలతో ఫుల్‌ బిజీగా మారిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube