రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకున్నారు.ఈ క్రమంలోని ప్రతి ఒక్కరూ తమ సోదరులకు రాఖీలు కట్టి వారు క్షేమంగా ఉండాలని ఈ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.
ఇక సినిమా సెలబ్రిటీల విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ రాఖీ పండుగ( Rakhi Festival )వేడుకను ఎంతో ఘనంగా జరుపుకున్నారు అని తెలుస్తుంది.ఈ క్రమంలోనే సెలబ్రిటీలు వారి రాఖీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఇదిలా ఉండగా సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ఎన్టీఆర్( NTR )మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో మనకు తెలిసిందే.వీరిద్దరూ ఒకరికొకరు ఎంతో ప్రేమగా బావ అంటూ పిలుచుకుంటారు.ఈ విధంగా వీరిద్దరి మధ్య ఎంతో మంచి రిలేషన్ ఉందని చెప్పాలి.ఇకపోతే రాఖీ పండుగ సందర్భంగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి( Lakshmi Pranathi )ఏకంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి తనకు రాఖీ కట్టారని తెలుస్తుంది.

ఈ విధంగా అల్లు అర్జున్ కి లక్ష్మీ ప్రణతి రాఖి కట్టడానికి వెళ్ళగా అల్లు అర్జున్ మాత్రం ఊహించని విధంగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తూ లక్ష్మీ ప్రణతిని సర్ప్రైజ్ చేశారట అల్లు అర్జున్ ఇచ్చినటువంటి గిఫ్ట్ చూసిన ఎన్టీఆర్ ( NTR ) కూడా షాక్ అయ్యారని తెలుస్తోంది.మరి అల్లు అర్జున్ లక్ష్మీ ప్రణతికి ఏ విధమైనటువంటి కానుక ఇచ్చారనే విషయానికి వస్తే ఈయన ఏకంగా కోటి రూపాయలు విలువ చేసే ఒక డైమండ్ వాచ్( Diamond Watch )తనకు కానుకగా ఇచ్చారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ వార్త వైరల్ గా మారింది.

ఈ విధంగా లక్ష్మీపతి అల్లు అర్జున్ కు రాఖీ కట్టారంటూ కూడా ఎక్కడ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ కానీ ఎన్టీఆర్ కానీ తెలియజేయలేదు కానీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే ఈ విషయంపై స్పందించాల్సి ఉంటుంది.ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన పుష్ప 2( Pushpa 2 )సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ఈయన కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి దేవర సినిమా( Devara Movie ) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం ఈ సినిమా శర గంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి సెలవులలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.