2022 లో సక్సెస్ ను కంటిన్యూ చేసిన స్టార్స్ వీరే ?

రెండు సంవత్సరాల కరోనా ఎడబాటు తర్వాత తెలుగు సినిమా పరిశ్రమకు ఈ సంవత్సరం లాభాల పంట పండించించి అని చెప్పాలి.ప్రస్తుతం వరకు ఈ సంవత్సరంలో జూన్ వరకు సినిమా ఇండస్ట్రీ బేషుగ్గా ఉంది.

 July First Half Hitter In 2022 , Nagachaitanya ,kriti Shetty , Sidhu Jonnalaigad-TeluguStop.com

ముఖ్యంగా కొందరు సినిమా ప్రముఖులకు 2022 బాగా కలిసి వచ్చింది.అయితే వారెవరో తెలుసుకుందాం రండి.

నాగ‌చైత‌న్య – కృతి శెట్టిః

ఈ సంవత్సరం మొదటి నెలలో సంక్రాంతి పండుగ కానుకగా నాగచైతన్య మరియు నాగార్జున నటించిన చిత్రం బంగార్రాజు విడుదల అయింది.ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతిసెట్టి హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా సోగ్గాడే చిన్న నాయన మూవీ కి సీక్వెల్ గా వచ్చింది.ఇది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి అందరికీ మంచి లాభాలను తెచ్చిపెట్టింది.

అయితే అంతకు ముందు నాగచైతన్య నటించిన మజిలీ, వెంకీమామ మరియు లవ్ స్టోరీ ల తర్వాత మరో హిట్ తన ఖాతాలో పడింది.అదే విధంగా కృతి శెట్టి కి సైతం ఉప్పెన మరియు శ్యామ్ సింగరాయ్ లతో పట్టు ఇది కూడా హిట్ అయ్యి హ్యాట్రిక్ సాధించింది.

Telugu Adivi Shesh, Anil Ravipudi, Kriti Shetty, Mahesh Babu, Nagachaitanya, Paw

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డః

టాలీవుడ్ లో పోను పోను యంగ్ టాలెంట్ ఎక్కువ అవుతోంది.అలా వచ్చిన హీరోలలో ఒకడే సిద్దు జొన్నలగడ్డ… ఇతనికి సినిమా అంటే ఒక ఫాషన్ అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఫిబ్రవరి లో డీజే టిల్లు పేరుతో సినిమా రిలీజ్ అయి సంచలన విజయాన్ని అందుకుంది.ఇక ఇది కాకుండా అంతకు ముందు ఓ టి టి లో వచ్చి హిట్స్ అందుకున్న వాటిలో ‘కృష్ణ అండ్ హిజ్ లీల‌`, `మా వింత గాథ వినుమా` లు ఉన్నాయి.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ః

పవన్ రాజకీయాలతో బిజీ అయ్యాక సినిమాల గురించి పూర్తిగా పక్కన పెట్టేశాడు అనుకుంటున్నా సమయంలో వకీల్ సాబ్ లాంటి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి సాలిడ్ హిట్ ను అందుకున్నాడు.అయితే ఇది గత సంవత్సరం ఆఖరిలో రిలీజ్ అయింది.ఆ తర్వాత ఫిబ్రవరి లో భీమ్లా నాయక్ అనే మలయాళ రీమేక్ తో వచ్చి మరోసారి హిట్ ను అందుకుని తనకు సాటిలేదు అని నిరూపించాడు.

ఎన్టీఆర్ – రాజ‌మౌళిః

జక్కన డైరెక్టర్ గా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు హీరోలుగా చేసిన పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ ఏ రేంజ్ హిట్ అను అందుకుందో తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి రాజమౌళి స్టామినా ఏమిటో ప్రపంచానికి చూపించాడు.ఇక ఎన్టీఆర్ దీనికి ముందు వరుసగా తెంపెర్, నాన్నకుప్రేమతో, జై లవకుశ, అరవిందసమేతల రూపంలో హిట్స్ అందుకున్నాడు.

అలా ఆర్ ఆర్ ఆర్ తో కలిపి ఎన్టీఆర్ కు డబల్ హ్యాట్రిక్ అయింది.ఇక రాజమౌళి విషయానికి వస్తే.వరుసగా హిట్ లను అందిస్తూ తనకు తిరుగులేదు అని నిరూపించుకుంటున్నారు.`స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్`, `సింహాద్రి`, `సై`, `ఛ‌త్ర‌ప‌తి`, `విక్ర‌మార్కుడు`, `య‌మ‌దొంగ‌`, `మ‌గ‌ధీర‌`, `మ‌ర్యాద రామ‌న్న‌`, `ఈగ‌`, `బాహుబ‌లి – ది బిగినింగ్`, `బాహుబ‌లి – ది కంక్లూజ‌న్` మరియు `ఆర్ ఆర్ ఆర్` లతో మొత్తం 12 సినిమాలు రికార్డు విజయాలను అందుకున్నాయి.

ప్ర‌శాంత్ నీల్ః

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చాప్టర్ 1 తో వెలుగులోకి వచ్చాడు.ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుంది అనేది ప్రేక్షకులే చెబుతారు.

ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన మూవీ కెజిఎఫ్ చాప్టర్ 2.ఇది ఇంకో లెవెల్ అని చెప్పాలి.తనకు మొదటి చేసిన సినిమా ఉగ్రం తో కలిపి ప్రశాంత్ నీల్ కి కూడా హ్యాట్రిక్ హిట్స్ దక్కాయని చెప్పాలి.ఇక కెజిఎఫ్ స్టార్ హీరో యష్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు .

మ‌హేశ్ బాబు

– మైత్రీ మూవీ మేక‌ర్స్ – ప‌ర‌శురామ్ః సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు వరుస విజయాలతో మంచి ఊపుమీదున్నాడు.గత నెలలో విడుదలైన సర్కారు వారి పాటతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ సినిమాకు పరుశురాం దర్శకత్వం వహించాడు.ఇక దీనికి ముందు వచ్చిన భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ తో హ్యాట్రిక్ సాధించిన విషయం తెలిసిందే.

ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఉప్పెన, పుష్ప ల తర్వాత మరో హిట్ ను అందుకుంది.అలాగే పరుశురాం తో మైత్రి మూవీ మేకర్స్ కు గీత గోవిందం తర్వాత రెండవ సినిమా కావడం విశేషం.

Telugu Adivi Shesh, Anil Ravipudi, Kriti Shetty, Mahesh Babu, Nagachaitanya, Paw

శివ కార్తికేయ‌న్ః

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ ఇంతకు ముందు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన డాక్టర్ తో మంచి హిట్ ను అందుకున్నాడు.ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన మరోచిత్రం డాన్ తో సూపర్ హిట్ ను అందుకున్నాడు.

వెంక‌టేశ్ – అనిల్ రావిపూడిః

గత నెలలో ఎన్నో అంచనాలతో కామెడీ ఎంటర్ టైనర్ గా ఎఫ్ 3 రిలీజ్ అయింది.ఈ సినిమా హీరో వెంకటేష్ కు మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి కి హ్యాట్రిక్ ను ఇచ్చింది.

వెంకటేష్ కు గురు, ఎఫ్ 2, వెంకీమామ, నారప్ప, దృశ్యం 2, తర్వాత ఈ సినిమా హిట్ తో డబల్ హ్యాట్రిక్ అయింది.అని రావిపూడి కూడా `ప‌టాస్`, `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2`, `స‌రిలేరు నీకెవ్వ‌రు`, ఎఫ్ 3 సినిమాలతో డబల్ హ్యాట్రిక్ చేరుకున్నాడు.

Telugu Adivi Shesh, Anil Ravipudi, Kriti Shetty, Mahesh Babu, Nagachaitanya, Paw

అడివి శేష్ – శ‌శి కిర‌ణ్ తిక్కః

జూన్ మొదటి వారంలో అడవి శేష్ హీరోగా చేసిన మేజర్ చిత్రం రిలీజ్ అయింది.విడుదలైన అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ తో నడుస్తోంది.ఈ సినిమా శశికిరణ్ తిక్క డైరెక్షన్ లో తెరకెక్కింది.ఇంతకు ముందు వీరి కాంబోలో గూఢచారి సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.ఇక అడవి శేష్ కు `క్ష‌ణం`, `అమీ తుమీ`, `గూఢ‌చారి`, `ఎవ‌రు` హిట్ లతో పాటు మేజర్ విజయంతో సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు.

Telugu Adivi Shesh, Anil Ravipudi, Kriti Shetty, Mahesh Babu, Nagachaitanya, Paw

లోకేశ్ క‌న‌క‌రాజ్ః

తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పుడు టాక్ అఫ్ ది తమిళ్ ఇండస్ట్రీ గా మారాడు.సింపుల్ గా వరుస విజయాలను అందుకుంటూ అందరినీ షాక్ లో ముంచెత్తుతున్నాడు.ఇతని డైరెక్షన్ లో మానగరం, ఖైదీ, మాస్టర్ మరియు విక్రమ్ లాంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.

ఈ విధంగా 2022 లో మొదటి అర్ధభాగం కొందరికి లాభం చేకూర్చింది.మరి సెకండ్ పార్ట్ ఎలా ఉంటుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube