స్కేటింగ్ చేస్తూ గుర్రంతో పోటీ పడిన యువతి.. చివరకు ఏమైందంటే

ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత సోషల్ మీడియాలో ఎన్నో ఆసక్తికర విషయాలు మనకు తెలుస్తున్నాయి.ఆసక్తికరమైన వీడియోలు, నవ్వించేవి, కవ్వించేవి, కన్నీళ్లు పెట్టించేవి, వావ్ అనిపించేవి ఇలా ఎన్నో రకాల వీడియోలు, వార్తలు చూస్తున్నాం.

 Woman Competes With Horse In Skating Details, Skateing, Viral Latest, News Viral-TeluguStop.com

ప్రపంచంలో ఏ మూల ఆసక్తికర ఘటన జరిగినా సోషల్ మీడియా ద్వారా మనకు క్షణాల్లో తెలిసిపోతోంది.అలా కొన్ని వీడియోలు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

తాజాగా ఓ అమ్మాయి గుర్రంతో పోటీ పడుతూ స్కేటింగ్ చేసిన వీడియో ఆసక్తికరంగా మారింది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఇటీవల కాలంలో చాలా మంది వినూత్నంగా వీడియోలు చేస్తున్నారు.

ఓ అమ్మాయి చీరకట్టులో స్కేటింగ్ చేసిన వీడియో బాగా వైరల్ అయింది.

జీన్స్ వేసుకుని స్కేటింగ్ చేయాలన్నా చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది.అయితే ఓ వైపు కుచ్చిళ్లు జారకుండా, మరో వైపు ఏ ప్రమాదమూ జరగకుండా ఆమె స్కేటింగ్ చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు.

తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్ అయిన ఓ వీడియోలో ఓ అమ్మాయి గుర్రంతో పోటీ పడుతూ రోడ్డుపై స్కేటింగ్ చేసింది.ఆ గుర్రం వేగంగా వెళ్లగా ఆమె కూడా అంతకు మించి వేగంతో ముందుకు వెళ్లింది.

చివరికి అలసిపోయిన గుర్రం నెమ్మదించగానే ఆమె కూడా తన స్కేటింగ్ వేగాన్ని తగ్గించేసింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లను ఆమె ప్రతిభను మెచ్చుకుంటున్నారు.గుర్రంతో పోటీ పడి మరీ స్కేటింగ్ చేయడం చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు.ఇక వేగంగా పరుగులు పెట్టే జంతువు అనగానే గుర్రం అందరి మదిలో మెదులుతుంది.

అలాంటి గుర్రంతో పోటీపడడమంటే మామూలు విషయం కాదని పలువురు కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియో చూడగానే తమకు మానసిక ప్రశాంతత లభించిందని కొందరు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube