స్కేటింగ్ చేస్తూ గుర్రంతో పోటీ పడిన యువతి.. చివరకు ఏమైందంటే
TeluguStop.com
ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత సోషల్ మీడియాలో ఎన్నో ఆసక్తికర విషయాలు మనకు తెలుస్తున్నాయి.
ఆసక్తికరమైన వీడియోలు, నవ్వించేవి, కవ్వించేవి, కన్నీళ్లు పెట్టించేవి, వావ్ అనిపించేవి ఇలా ఎన్నో రకాల వీడియోలు, వార్తలు చూస్తున్నాం.
ప్రపంచంలో ఏ మూల ఆసక్తికర ఘటన జరిగినా సోషల్ మీడియా ద్వారా మనకు క్షణాల్లో తెలిసిపోతోంది.
అలా కొన్ని వీడియోలు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.తాజాగా ఓ అమ్మాయి గుర్రంతో పోటీ పడుతూ స్కేటింగ్ చేసిన వీడియో ఆసక్తికరంగా మారింది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.ఇటీవల కాలంలో చాలా మంది వినూత్నంగా వీడియోలు చేస్తున్నారు.
ఓ అమ్మాయి చీరకట్టులో స్కేటింగ్ చేసిన వీడియో బాగా వైరల్ అయింది.జీన్స్ వేసుకుని స్కేటింగ్ చేయాలన్నా చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది.
అయితే ఓ వైపు కుచ్చిళ్లు జారకుండా, మరో వైపు ఏ ప్రమాదమూ జరగకుండా ఆమె స్కేటింగ్ చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్ అయిన ఓ వీడియోలో ఓ అమ్మాయి గుర్రంతో పోటీ పడుతూ రోడ్డుపై స్కేటింగ్ చేసింది.
ఆ గుర్రం వేగంగా వెళ్లగా ఆమె కూడా అంతకు మించి వేగంతో ముందుకు వెళ్లింది.
చివరికి అలసిపోయిన గుర్రం నెమ్మదించగానే ఆమె కూడా తన స్కేటింగ్ వేగాన్ని తగ్గించేసింది.
"""/" /
ఈ వీడియో చూసిన నెటిజన్లను ఆమె ప్రతిభను మెచ్చుకుంటున్నారు.గుర్రంతో పోటీ పడి మరీ స్కేటింగ్ చేయడం చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు.
ఇక వేగంగా పరుగులు పెట్టే జంతువు అనగానే గుర్రం అందరి మదిలో మెదులుతుంది.
అలాంటి గుర్రంతో పోటీపడడమంటే మామూలు విషయం కాదని పలువురు కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియో చూడగానే తమకు మానసిక ప్రశాంతత లభించిందని కొందరు కామెంట్లు పెడుతున్నారు.
సీనియర్ హీరో రాజశేఖర్ కు మూవీ ఆఫర్లు తగ్గడానికి కారణాలివేనా.. అక్కడే తప్పు జరిగిందా?