వైరల్: రైలు పట్టాల కిందపడి చాకచక్యంగా వ్యవహరించిన ఈ కుక్కని చూడండి... దాని తెలివికి జోహార్లు!

కొన్ని శతాబ్దాలుగా మానవ జాతికి ఎంతో విశ్వాసపాత్రమైన జంతువులుగా కుక్కలు మెలుగుతున్నాయి.కుక్కలు విశ్వాసంలోనే కాదు, తెలివితేటలతో కూడా ఒక్కోసారి మనిషిని మించిపోతాయి అనడానికి తాజాగా సంఘటనే ఓ ఉదాహరణ.

 Viral Check Out This Clever Dog Who Fell Under The Train Tracks  Kudos To His In-TeluguStop.com

వాటికి ఎంతో సమయస్ఫూర్తి ఉంటుంది.అలాంటి శునకానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆ వైరల్ వీడియోలో ఒక కుక్క తృటిలో మరణం నుంచి తప్పించుకున్న దృశ్యాలను మనం స్పష్టంగా చూడవచ్చు.

వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే, ఒక కుక్క రైలు పట్టాల కింద పడి కదులుతున్న రైలు పైన వెళుతున్నా మధ్య పడి నలిగిపోకుండా… తననితాను కాపాడుకున్న ఉదంతాన్ని మనం చేయవచ్చు.అవును, మొదట ఆ కుక్క పట్టాలమీద వున్న ఆహారం కొరకు కిందికి దిగింది.అయితే సరిగ్గా అదే సమయంలో అనూహ్యంగా ట్రైన్ ఆ పట్టాలమీద గుండా వెళుతోంది.

దాంతో పెను ప్రమాదం ఊహించిన కుక్క అదే పట్టాలమీద కాస్త కిందకి వంగి ట్రైన్ పూర్తిగా వెళ్లిపోయేవరకూ అలాగే వేచి ఉంది.ఆ రైలు వెళ్లిపోయిన తర్వాత ఏమి జరగలేదన్నట్లుగా దర్జాగా బయటకు వచ్చేసింది.

ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆ కుక్క అంత సమయస్ఫూర్తితో ఎలా ఆలోచించగలిగిందని ఆశ్చర్యపోతున్నారు.Avinash Shishoo అనే ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ కాబడ్డ సదరు వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.అవును, ‘గాడ్, ది అల్టిమేట్ సేవియర్’ అనే కాప్షన్‌తో పోస్ట్ అయిన ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతూ… దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం అర్ధం కావడం లేదు.

అయితే 2021లో కూడా ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకోవడం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు.ఆ సంఘటనలో రైల్వే ట్రాక్‌లపై కూర్చున్న కుక్క కొల్లం-చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌ నుంచి బయటపడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube