విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ఖుషి సెప్టెంబర్ 1న వస్తుండగా ప్రస్తుతం పరశురాం( Parasuram ) తో ఒక సినిమా గౌతం తిన్ననూరితో మరో సినిమా చేస్తున్నాడు.పరశురాం సినిమా లో మృణాల్ ఠాకూర్( Mrinal Thakur ) హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.రీసెంట్ గా సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఒక ఎక్స్ క్లూజివ్ న్యూస్ బయటకు వచ్చింది.
అదేంటి అంటే విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ కలిసి నటిస్తున్న ఈ సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట దిల్ రాజు.
గీతా గోవిందం కాంబో అవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.అయితే పొంగల్ రేసులో ఆల్రెడీ ప్రభాస్( Prabhas ) ప్రాజెక్ట్ K, మహేష్ గుంటూరు కారం ఉన్నాయి.వీటితో పాటుగా పవన్ సినిమా కూడా వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి.
మరి వీటి మధ్య పొంగల్ రేసులో విజయ్ దేవరకొండ సినిమా వస్తుందా అన్నది డౌటే అని చెప్పొచ్చు.సంక్రాంతి అంటే ప్రతి హీరో ఫ్యాన్స్ కి తమ అభిమాన హీరో సినిమా చూడాలని అనుకుంటారు విజయ్ సినిమా వస్తే మాత్రం రౌడీ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు.