ప్రపంచ దేశాల్లో ఒక్కో చోట ఒక్కో రకమైన పద్ధతులు, ఆచారాలు ఉంటాయి.వాటిలో కొన్ని వింటే వింతగా అనిపిస్తుంటాయి.
అంతేకాదు.ఆశ్చర్యపోవాల్సి కూడా వస్తుంది.
ఆశ్చర్యపోవాల్సి కూడా వస్తుంది.ఇది కూడా సరిగ్గా ఆ కోవకు చెందిందే.
ఇండోనేషియాలోని జావా ద్వీపంలో మౌంట్ కేముకస్ అనే ప్రాంతం ఉంది.దీనిని సెక్స్ మౌంటెన్ అని కూడా పిలుస్తారు.
ఇక్కడ పర్వత ప్రాంతంలో ఒక ఆలయం ఉంది.ఈ ఆలయానికి కేవలం పండుగ రోజుల్లో మాత్రమే భక్తులు వస్తారు.
కాలినడకన పర్వతాన్ని ఎక్కుతారు.ఈ మందిరం జావా రాజు కుమారుడికి, అతని సవతి తల్లి కి అంకితం చేసారు.
వీరిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల ఆ రాజు వీరిని బహిష్కరించారు.అప్పుడు వీరు అక్కడ ఉన్న కేముకస్ పర్వతాలకు వెళ్తారు.
వీరు ఆ పర్వతంపై శృంగారం చేసినప్పుడు కొందరు సైనికులు చూసి వారిని చంపి అక్కడే గొయ్యితీసి పాతిపెట్టారట.
దీంతో అప్పుడు వారి జ్ఞాపకంగా ఈ మందిరం నిర్మించారు.
ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక ఉత్సవం జరుగుతుంది.ఈ ఉత్సవంలో ఆ యువరాజు అసంపూర్ణంగా చేసిన శృంగారాన్ని అక్కడికి వచ్చిన ప్రజలు అపరిచితులతో కలిసి చేయాలి.
పెళ్లి అయినా జంట కూడా వేరే వ్యక్తులతో శృంగారాన్ని చేయవచ్చు.అలా చేయడం వల్ల అదృష్టం వస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతారు.
అయితే ఇలా శృంగారం ఒక్కసారి కాదు ఏడూ సార్లు చేయాల్సి ఉంటుందట.సంవత్సరంలో 35 రోజులకు ఒకసారి అదే అపరిచిత వ్యక్తితో శృంగారం చేస్తే అదృష్టం వరిస్తుందట.
ఇలా చేసుకున్న సమయంలో ఆ వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం వంటివి కూడా ఇక్కడ జరుతుంటాయట.ఈ ఆచారాన్ని అక్కడి ప్రజలు కొందరు తిరస్కరిస్తున్నట్లు సమాచారం.