పవన్, చంద్రబాబు ల మధ్య “ఆ అధినేత”...సయోధ్య..???

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరికీ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని , ఇద్దరు అధినేతలు ఈ ఎన్నికల్లో వేరు వేరుగా ఉన్నా ఎన్నికల అనంతరం కలిసిపోతారని మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చేలా పవన్ కళ్యాణ్ చర్యలు ఉన్నాయని, గత కొంతకాలంగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.అయితే ఈ వార్తలన్నీ నిజమేనని పవన్ కి చంద్రబాబు కి మధ్య మొదట్లో సయోధ్య లేకపోయినా ఆ తరువాత ఓ మీడియా అధినేత ఇద్దరి మధ్య సయోధ్య చేశారని రానున్న ఎన్నికల తరువాత పవన్ బాబు ఒక్కడే అవ్వడం ఖాయమని తాజాగా ఒక కథనం వైరల్ అవుతుంది ఆ వివరాల్లోకి వెళ్తే.

 Understanding Between Pawan And Chandrababu-TeluguStop.com

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన తరుణం మొదలు చంద్రబాబు పై నిప్పులు తిరుగుతూనే ఉన్నారు.గుంటూరు వేదికగా చంద్రబాబును చీల్చిచెండాడిన పవన్ కళ్యాణ్ కొంతకాలంగా చంద్రబాబు కి అనుకూలంగా మాట్లాడటం, అభ్యర్ధుల విషయంలో బాబు కి అనుకూలంగా డమ్మీలని నిలబెట్టడం చూస్తుంటే ఏపీ ప్రజలకు , జనసేన కార్యకర్తలకు షాక్ ఇచ్చింది.

అయితే ఒక్కసారిగా పవన్ లో ఈ మార్పు రావడానికి గల కారణం ఓ మీడియా అధినేతేనని , ఆ మీడియా అధినేత ఇద్దరి మధ్య సయోధ్య చేశారని అందుకు గాను సదరు మీడియా అధినేతకి భారీగా డబ్బులు అందాయని తెలుస్తోంది.

ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతు గనుకా లేకపోతే మరో సారి అధికారంలోకి రావడం కష్టం కావడం, మళ్ళీ ఇద్దరి మధ్య లోపాయికారిగా ఒప్పందం కుదరడంతో ఈ రాజీ చేసిన ఆ మీడియా అధినేతకి తిరుమల తిరుపతి లో వెయ్యి గజాల స్థలం బహుమానంగా ముట్టిందట.అంతేకాదు ఇప్పటికే సదరు మీడియాధిపతి గెస్ట్ హౌస్ కూడా కట్టడానికి సిద్దమవుతున్నారట.ఇప్పుడు ఈ వార్తా వైరల్ అవడంతో తిరుమలలో ఇచ్చిన స్థల విషయం వివాదం అవుతోందట.

అయితే ఎన్నికల వేళ ఎంతో క్రియాశీలకంగా పని చేయాల్సిన మీడియా ఇప్పుడు పార్టీలకి తగ్గట్టుగా అనుకూల వార్తలు చెప్పడం, ప్రజలని తప్పుదోవ పట్టించడం అందుకు ప్రతిగా భారీ బహుమానాలు అందుకోవడం ఎంతవరకూ సమంజసం అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.దాంతో ఏ మీడియా వార్త నిజమని నమ్మాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

ఏది ఏమినా పవన్ ,చంద్రబాబు ల మధ్య సయోధ్య విషయం ఎంతవరకూ నిజమో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ఏపీలో హల్చల్ చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube