ఏపీలో రాజ్యాంగేతర పనులు జరుగుతున్నాయని టీడీపీ నేత, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు ఆరోపించారు.ప్రతిపక్షాల పర్యటనలను అడ్డుకునేందుకే ప్రభుత్వం జీవో నెంబర్.1ను తీసుకొచ్చిందన్నారు.
ఆ జీవోను హైకోర్టు కొట్టివేసినా వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదని మండిపడ్డారు.
ప్రతిపక్షాలపై కేసులు పెట్టడమే వైసీపీ సర్కార్ పని అని విమర్శించారు.జగన్ పాలనలో ఏ ఒక్క వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరన్న ఆయన ఏపీలో పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని వెల్లడించారు.
ఏపీలో ప్రభుత్వ అధికారులకు కూడా సరిగ్గా జీతాలు లేవని విమర్శించారు.అంతేకాకుండా రాష్ట్రంలో మంత్రులకు విలువ లేదని ఆరోపించారు.