యూఏఈ లోని ప్రవాస భారతీయులకి...“టెలీ కౌన్సిలింగ్”

యూఏఈ లో ఉండే ప్రవాసులలో భారతీయులే అత్యధికంగా ఉంటారు.వలస కూలీలుగా అక్కడికి వివిధ ప్రాంతాలలో పలు రంగాలలో పనిచేయడానికి వెళ్తూ ఉంటారు.

 Uae, Indians, Nri, Tele Counseliing, Pawan Kapoor, Corona-TeluguStop.com

కరోనా నేపధ్యంలో ప్రవాస భారతీయులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని జీతాలు లేక, ఉద్యోగాలు పోయి వారు పడే పాట్లు మానసికంగా వారిని కుంగ తీస్తున్నాయని తెలుస్తోంది.ఈ క్రమంలో వారిలో ధైర్యం నింపడానికి,మానసికంగా వారిని ధృడ పరచడానికి భారత ఎంబసీ టెలీ కౌన్సిలింగ్ సేవలు అందిస్తోంది…

ఎంతో మంది ప్రవాసులు అక్కడ ఉన్నా ప్రస్తుతం 500 మంది మాత్రమే ఈ టెలీ కౌన్సిలింగ్ సేవలు పొందారు.

ఉద్యోగాలు పోయి, జీతాలు రాని ప్రవాసులు టెలీ కౌన్సిలింగ్ సేవలు పొందటం కోసం [email protected] కి తమ వివరాలు తెలుపుతూ ఈ మెయిల్ చేయాలని తెలిపారు.మీరు అక్కడ పరిస్థితులు ఎదుర్కోవడం ఎంతో ముఖ్యమైన విషయం ఈ సమయంలో మీకు ఎంతో ధైర్యం అవసరం కాబట్టి మీ వివరాలు ఈ మెయిల్ చేయండి అంటూ భారత రాయబారి పవన్ కపూర్ తెలిపారు.

మీ వివరాలు అందిన వెంటనే మేము ఏర్పాటు చేసిన వైద్య బృందం ఈ మెయిల్ ద్వారా వివరాలు పంపిన వ్యక్తికి కాల్ చేసి మానసికంగా ధైర్యంగా ఉండటానికి సూచనలు ఇస్తుందని తెలిపారు.ఒక వేల అత్యవసరం అనుకుంటే తాము ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ 24X 7 నెంబర్ : 0508995583 కి ఫోన్ చేయాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube