హార్ట్ బ్రేకింగ్ వీడియో: వెళుతున్న కారుపై సైనిక ట్యాంక్ ఎక్కించిన రష్యన్ ఆర్మీ... చావుబతుకుల మధ్య డ్రైవర్..!

ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.నాటో దళాల్లో ఉక్రెయిన్ చేరిపోతుందనే ఆగ్రహంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ లో నెత్తుటేళ్లను, రక్తపుటేరులను పారిస్తున్నారు.

 The Russian Army Loaded A Military Tank On The Car. The Driver Among The Dead V-TeluguStop.com

మొదట కేవలం ప్రభుత్వ భవనాల పై మాత్రమే దాడి చేసిన రష్యన్ ఆర్మీ ఇప్పుడు సామాన్య ప్రజలు నివసించే భవనాలపై కూడా బాంబుల వర్షం కురిపిస్తున్నారు.అంతేకాదు వీరు మరింత క్రూరంగా ప్రవర్తిస్తూ ఉక్రెయిన్ దేశస్థుల జీవితాలను చిదిమేస్తున్నారు.

తాజాగా ఒక రష్యన్ సైనిక ట్యాంక్ ఉక్రెయిన్ పౌరుడు నడుపుతున్న కారు పైకి దూసుకెళ్లింది.రష్యన్ సైనికులు కావాలనే ట్యాంకర్ ని కారు పైకెక్కి ఎక్కించి దారుణంగా తొక్కించారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.దీన్ని చూసిన నెటిజన్లు “అయ్యో పాపం అని, ఇది చాలా హార్ట్ బ్రేకింగ్” అని కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక రోడ్డుపై రష్యన్ ఆర్మీ ట్యాంక్ వెళ్తుండటం గమనించవచ్చు.ఇంతలోనే మరో వైపు నుంచి ఒక కారు అదే రహదారిపై వెళ్లడం గమనించవచ్చు.అయితే స్ట్రెయిట్ గా వెళ్తున్న ఈ ఆర్మీ ట్యాంక్ అనేది కారును చూడగానే టర్న్ తీసుకొని దానిపైకి దూసుకొచ్చింది.ఆ తర్వాత కారు పైకి ఎక్కేసింది.దీంతో ఆ కారు డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యాడు.కారు తుక్కుతుక్కు అయ్యింది.

అందులో ఇరుక్కున్న డ్రైవర్ ని బయటికి తీసేందుకు స్థానికులు గంటల పాటు కష్టపడ్డారు.తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లారు.

వైద్యులు పుట్టిన క్షతగాత్రుడికి చికిత్స చేశారు.దీంతో అతడి పరిస్థితి కాస్త నిలకడగా ఉందని స్థానిక మీడియా తెలిపింది.

అయితే ఈ వీడియోని ట్విట్టర్ వేదికగా ఒక యూజర్ షేర్ చేశాడు.దీన్ని చూసిన నెటిజన్లు ఇది చాలా బాధాకరం, అమానుషం, ఘోరం అని కామెంట్లు పెడుతున్నారు.

దీనికి ఇప్పటికే కోటికి పైగా వ్యూస్ వచ్చాయి.ఈ గుండెల్ని మెలిపెట్టే వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube