తెలంగాణ లో కాంగ్రెస్ పడుతున్న కష్టాలు అన్ని ఇన్నీ కావు.తము రాజకీయ ప్రత్యర్థుల కంటే, సొంత పార్టీ నాయకుల వ్యవహారం కారణంగానే కాంగ్రెస్ ప్రతి ఎన్నికల్లోను ఓటమిని చవిచూస్తోంది.
అసలు కాంగ్రెస్ లో ఉన్నన్ని గ్రూపు రాజకీయాలు మరే పార్టీలోనూ కనిపించవు.ఎవరికి వారు తామే సీనియర్ నాయకులం అని, తమ మాటే చెల్లుబాటు కావాలని అధిష్టానం వద్ద తమకు పలుకుబడి ఉంది అంటూ.
తమ దర్పాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ ఉండడం , సొంత పార్టీలో నాయకులకు క్రెడిట్ రాకుండా , పార్టీని సైతం ఓడించేందుకు పావులు కదపడం ఈ తరహా రాజకీయాలన్ని తెలంగాణ కాంగ్రెస్ లో సర్వ సాధారణ అంశాలు గా తయారయ్యాయి.ప్రస్తుతం మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది.
మునుగోడు లో ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై కాంగ్రెస్ నేతలంతా దృష్టి పెట్టాల్సి ఉన్నా… ఇప్పుడు అక్కడ సీనియర్ నాయకులంతా ఆధిపత్యం ద్వారా ప్రదర్శిస్తుండడం, ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలిస్తే అదంతా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖాతాలో పడుతుందని… అదే ఓటమి చెందితే రేవంత్ ను పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారనే లెక్కలు వేసుకుంటూ… పార్టీ అభ్యర్థి ఓటమికి కృషి చేస్తూ ఉండడం వంటి సంఘటనలు తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం నెలకొంది.పార్టీ పరిస్థితి ఈ విధంగా దిగజారడంతో అదృష్టం నేరుగా రంగంలోకి దిగకపోతే పరిస్థితి చేజారిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది ఇలా ఉంటే.ప్రస్తుతం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు తెలంగాణలోకి ప్రవేశించింది.

ఈరోజు రాహుల్ యాత్ర తొలి రోజు కొంత సమయం జరిగి ముగిసింది .మరికొద్ది రోజులపాటు తెలంగాణలో రాహుల్ యాత్ర కొనసాగిపోతుంది.ఇదే విభేదాలను గురించి పార్టీ నాయకులు అందర్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చే విషయంపై ప్రధానంగా దృష్టి సాధించబోతున్నట్లు సమాచారం.రాహుల్ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చక్కదిద్ది మునుగోడు అభ్యర్థి విజయానికి కృషి చేయాలని గట్టి వార్నింగ్ ఇస్తే తప్ప మునుగోడులో నాయకులంతా సమిష్టిగా పనిచేసే అవకాశాలు కనిపించడం లేదు.
ప్రస్తుతం రాహుల్ యాత్ర తెలంగాణలో జరుగుతూ ఉండడంతో దానిని విజయవంతం చేసేందుకు రాహుల్ దృష్టిలో పడేందుకు తెలంగాణ కాంగ్రెస్ కీలక నాయకులంతా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటివరకు రాహుల్ చేపట్టిన పాదయాత్ర వివిధ రాష్ట్రాల్లో ముగిసింది.
అక్కడ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం పెరిగింది.గతంతో పోలిస్తే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగినట్లుగా అనేక సర్వేలు తేల్చాయి.
ఇదే మాదిరిగా తెలంగాణలోనూ రాహుల్ యాత్ర ఎఫెక్ట్ ఉంటుందని కచ్చితంగా కాంగ్రెస్ వైపు జనాలు చూపు పడుతుందని, అదే తమకు కలిసి వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ కీలక నాయకులంతా భావిస్తున్నారు. అంతే కాకుండా పార్టీలో యాక్టివ్ గా ఉంటే కీలక పదవులు దక్కుతాయనే అభిప్రాయం ఇప్పుడిప్పుడే నేతల్లో కలుగుతోంది.
ప్రస్తుతం జరుగుతున్న రాహుల్ యాత్ర మునుగోడు ఎన్నికలపై స్పష్టమైన ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది.దానిపైనే మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా ఆశలు పెట్టుకున్నారు.
మరి ఈ విషయంలో రాహుల్ ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తారో ?
.