రోజురోజుకు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి.కొందరు కేటుగాళ్లు అమాయక ప్రజలనే టార్గెట్ గా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా సూర్యాపేట డీఎంహెచ్ఓ కోటాచలం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు.కలెక్టర్ పాటిల్ హేమంత్ ఫొటోతో వాట్సాప్ క్రియేట్ చేశారు కేటుగాళ్లు.
అనంతరం డబ్బులు కావాలంటూ పలువురికి మెసేజ్ లు పెట్టారు.అర్జెంట్ అని హడావుడి చేయడంతో రూ.1.4 లక్షల విలువైన అమెజాన్ కార్డులను ఆరుగురి అకౌంట్ల ద్వారా డీఎంహెచ్ఓ పంపారు.అనంతరం మోసపోయానని గుర్తించిన అధికారి సైబర్ సెల్ కు ఫిర్యాదు చేశారు.