18 ఏళ్ళ క్రితం చిరుని ఫస్ట్ టైమ్ కలిసిన ఇప్పటి స్టార్ డైరెక్టర్.. ఎవరో గుర్తుపట్టగలరా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన మెగా స్టార్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మెగాస్టార్ చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీలోకి వచ్చారు.

 The Current Star Director Met Chiranjeevi First Time Is 18 Years Ago Can Anyone-TeluguStop.com

చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలోకి ఒక డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చారు.ప్రస్తుతం ఆ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ గా కొనసాగడమే కాకుండా ఏకంగా మెగాస్టార్ సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతలను కూడా తీసుకున్నారు.

అయితే ఆ దర్శకుడు తన హీరోని మొట్టమొదటిసారిగా 18 సంవత్సరాల క్రితం కలిసారు.నేడు ఆ హీరోతోనే సినిమా తీస్తున్న సందర్భంగా 18 ఏళ్ల క్రితం చిరుని కలిసి తీసుకున్న మొదటి ఫోటోను పోస్ట్ చేశారు.

మరి ఆ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా? అదేనండి చిరంజీవి 154 వ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్ బాబీ.ఈ సందర్భంగా బాబి సోషల్ మీడియా వేదికగా కలిసి దిగిన ఫోటోలు షేర్ చేశారు.

ఈ క్రమంలోనే ఆయన ఫోటోలు షేర్ చేస్తూ ఆయన పేరు వింటేనే ఎనలేని ఉత్సాహం.ఆయన సినిమా పోస్టర్లు చూస్తే అర్థం కాని ఆరాటం.తెర మీద ఆయన కనబడితే…ఒళ్ళు తెలీని పూనకం.పద్దెనిమిది సంవత్సరాల క్రితం….

ఆయన్ని మొదటి సారి కలసిన రోజు కన్న కల… నిజమవుతున్న ఈ వేళ మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను అంటూ బాబి తాను చిరుతో కలిసి దిగిన మొదటి ఫోటోను షేర్ చేశారు.ప్రస్తుత ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube