ఒకేసారి 5 బంతులను తిప్పేసిన ఘనుడు...!

టాలెంట్ ఎవడబ్బ సొత్తూ కాదు.అవును.

 Balls, New Record, Body, Eyes, Nose, Hand, Legs-TeluguStop.com

ఈ వీడియో గాని మీరు చూసినట్లయితే.మీకు కూడా ఇలానే అనిపిస్తుంది.‘పుట్టిన ప్రతి ఒక్కడు ఓ మంచి కళాకారుడే’ అన్నాడు ఓ మహానుభావుడు.అయితే ఆ కళను గుర్తించి, ఆ దిశగా సదరు పిల్లల తల్లిదండ్రులు వారిని సపోర్ట్ చేసినట్లయితే.

వారు అద్భుతాలు చేయగలుగుతారు.అలాంటివారే ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటున్న సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, సానియా మీర్జా మొదలగువారు.

అయితే కొంతమంది తల్లిదండ్రులు మాత్రం దీనికి విరుద్ధంగా వుంటారు.పిల్లలకు చదువు తప్ప వేరే లోకం ఒకటి ఉందనే విషయం తెలియకుండా పెంచుతారు.అలాంటివాళ్ల పిల్లలు ఏదో డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగాల కోసం తిరుగుతూ ఉంటారు.ఇష్టమైన పనిని చేయలేక, అలాగని ఉద్యోగంలో ఇమడలేక నానా అవస్థలు పడుతూ ఉంటారు.

బహుశా మీరు కూడా అందులో ఒకరేమో ఒకసారి ఆలోచించుకోండి.ఒకసారి క్రింది వీడియో తిలకించండి.

తప్పకుండా మీ జీవన గమనం మార్చుకుంటారు.

ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది.

ఒకరికి సింగింగ్, ఇంకొక్కరికి డాన్స్, వేరొకరికి యాక్టింగ్, మరొకరికి స్పోర్ట్స్ ఇలా ఒక్కో ఫీల్డ్ లో ప్రజ్ఞత కలిగి వుంటారు.కానీ ఇక్కడ కుర్రాడు మాత్రం అందరికి భిన్నంగా పెద్ద పెద్ద బాల్స్ తన శరీరంపైన అవలీలగా గిరగిరా తిప్పుతూ ఉన్నాడు.

మామూలుగా కొంతమంది స్మాల్ బాల్స్ ని తిప్పుతూ వుంటారు.అది కూడా కేవలం చేతితోనే.

ఇతడు మాత్రం చేతులతో, కాళ్లతో, నోటితో, పొట్టమీద, వీపుమీద, భుజం పైన… ఇలా ఎక్కడ పడితే అక్కడ సునాయాసంగా తిప్పగలుగుతాడు.మొత్తంగా ఒకేసమయంలో 5 బంతులను తిప్పగలుగుతున్నాడు.

కాగా, ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.ఇకపోతే అతడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంపాదించడం తన లక్ష్యమని చెబుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube