మధ్య ఆసియాలో ఇటు చైనా అటు రష్యా దేశాల మధ్య ఉన్న దేశం మంగోలియా.1922 లో సర్వ స్వతంత్రమైంది.పశువుల పెంపకం అక్కడి ప్రజల ప్రధాన వృత్తి.బౌద్ధ మతం ఎక్కువ ఉంది.గ్రేట్ పీపుల్స్ ఖురాల్ చైనా ,మంగోలియా మధ్య ఉన్నది పాత స్నేహమే.అయితే ఇటీవల చైనా అన్ని దేశాలతోను సయోధ్యతో సాగుతోంది.
చైనా మాటలలో ఎంత సత్యం ఉన్నదో కాని దేశాలను ఆకర్షించే విధంగా ఆయా దేశాలను కొనియాడుతుంది.అదే మంగోలియా పట్ల చేసింది.
మంగోలియా పెద్ద ఆర్ధిక స్థితి వంతమైన దేశమేమి కాదు.కాకపోతే అక్కడి ప్రజలు చాలా కష్ట పడి చేస్తారు.
ప్రతి ఒక్కరూ పశువుల పెంపకం అనేది ఒక వృత్తిగా పెట్టుకున్నారు.అదే ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరు.
ప్రజలలో భక్తి భావం కూడా ఎక్కువే.బౌద్ధం అక్కడ విశేషంగా ఆదరింప బడుతోంది.
మంగోలియా లో ఎప్పుడూ ఆర్ధిక అస్థిరత కాని ,సంక్షోభం కాని లేవు.ఓ ప్రణాళికతో అది ముందుకు నడుస్తోంది.
సంక్షోభం, ఆర్ధిక లోటు పాట్లు ఆ దేశంలో కనిపించవు.ఉన్న వనరులతోనే ఆ దేశం మనుగడ సాగిస్తోంది.
ఈ విషయం ఆఫ్ఘనిస్తాన్ గ్రహిస్తే చాలు.ఆఫ్ఘన్ లో ఆకలి చావులు, తీవ్ర సంక్షోభం ఏర్పడటం పిల్లలను విక్రయించడం జరుగుతోంది.
ఇన్ని జరుగుతున్న ఏమి చేయలేని స్థితి ఆఫ్ఘన్ ది.ఆఫ్ఘనిస్తాన్ తో మంగోలియా ను పోల్చుకుంటే ఆఫ్ఘనిస్తాన్ బెటర్.అయితే ఒక క్రమబద్ద మైన ప్రణాళిక ఆఫ్ఘన్ కు లేదు.ఈ విషయంలో మంగోలియా నుంచి ఒక్క ఆఫ్ఘన్ ఏ కాక ప్రపంచ దేశాలన్నీ తెలుసుకోవాలి.
చిన్న దేశమైన మంగోలియా లో ఎటువంటి ఒడిడుకులు లేవు.చాలా వరకు సొంత ఆర్ధిక వ్యవస్థ తోనే మంగోలియా ముందుకు సాగుతోంది.
అది చూసే చైనా మంగోలియా ను పొగడ్తలతో ముంచెత్తింది.చైనా లో పర్యటిస్తున్న మంగోలియా అధ్యక్షుడు ఉఖ్ నాగిన్ ఖురేలుక్స్ తో జిన్ పింగ్ సమావేశం అయినారు.
రెండు దేశాలు పరస్పర సహకారం, విశ్వాసం తో ముందుకు సాగుదామని విశ్వసించారు.సుస్థిర సంబంధాలు మేము కోరుకుంటామని చైనా వక్కాణించింది.
చైనా , మంగోలియా ల మిత్రత్వం నవ శకానికి నాంది కావాలని,మంచి భాగస్వామ్యం మాకు మంగోలియా ఉంటుందని ఆశాభావం చైనా వ్యక్తం చేసింది.మంగోలియా లో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం ప్రశంసించదగ్గదని పర్యావరణం లో మొక్కలు కీలకం అని మంగోలియా ను ఈ విషయంలో అభి నందిస్తున్నామని,మరియు మంగోలియా వ్యాప్తంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం కొనియాడుతున్నామని జిన్ పింగ్ ప్రశంసించారు.
విద్యలో మంగోలియా వెనుక బడి ఉన్న ఆ దేశానికి పూర్తి సహకారం అందిస్తామని మరియు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇరువురికి లాభం చేకూరేలా ఓ దృఢమైన బంధం పటిష్టం చేసుకోవాలని జిన్ పింగ్ మాటను ఖురేలుక్స్ అంగీకరించారు.సుస్థిర సంబంధం కొరకు,మానవాళి భవిష్యత్ కోసం మంగోలియా తో కలసి నడుస్తామని చైనా పేర్కొంది.
గత కోవిడ్ లో పరస్పరం సహకరించుకొని ముందుకు వెళ్ళాం అని చెప్పారు.ఇటీవలే మంగోలియా ప్రకటించిన నూతన రికవరీ విధానం లక్ష్యం బాగున్నాయని చైనా తెలిపింది.
విజన్ 2050 కు ఇరు దేశాలు కట్టుబడి ఉండాలని అంగీకరించారు.
అభివృద్ధి రెండు దేశాల లక్ష్యం అని, ఇందులో సహకారంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు వుంటాయని చైనా వాంఛ.సమాచార,సాంకేతిక రంగాల్లో సహకారానికి మేం సిద్ధమని జిన్ పింగ్ తెలిపారు.ఉత్తమమైన భవిష్యత్ ను ఇరువురం కలసి నిర్మించుకుందామని మంగోలియా, చైనా అధ్యక్షులు సంకల్పించారు.
అయితే ఎంతవరకు ఈ బంధం నిలుస్తుందో తెలియదు.ప్రస్తుతం మంగోలియా కు ఆర్ధిక సహాయం అంత అవసరం లేదు.
మంగోలియా లక్ష్యం అంతా పర్యావరణం మీదనే.పర్యావరణం కలుషితం కాకుంటే దేశం అభివృద్ధి లో ముందుకు సాగుతుందని,తమ ప్రజల లక్ష్యం అదేనని మంగోలియా పేర్కొంది.
కోవిడ్ లో కాస్త దెబ్బతిన్న తిరిగి పుంజుకున్నామని మంగోలియా ధీమాగా ఉంది.తమ ప్రజల సహకారం మాకు బలమని,మొక్కలు నాటే కార్యక్రమం వేగంగా జరుగుతోందని మంగోలియా పేర్కొనడం గమనార్హం.
విశ్వంలో ఏ దేశం కూడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఓ ప్రాజెక్టు కింద చేర్చ లేదు.
భారత్ లో తెలంగాణ రాష్ట్రంలో చేశారు.అయితే భారత్ అంతటా చేయలేదు.స్వచ్ఛ భారత్ పైనే భారత దేశం దృష్టి ఉంది.
ఇంకా చాలా చోట్ల స్వచ్ఛ కార్యక్రమాలు జరగాలి.అయితే పర్యావరణ లక్ష్యం కింద మంగోలియా ప్రభుత్వం చేపట్టిన కార్యకమాన్ని భారత్ తో పాటు పలు దేశాలు కొనియడాయి.
ముఖ్యంగా చైనా మంగోలియా ను కొనియాడటం చూస్తే అది మంగోలియా తో స్నేహం కంటే భద్రత పైనే ఎక్కువ దృష్టి ఉంచినట్లు కనిపిస్తోంది.అన్ని రంగాలలో సహకరించుకుని మంచి మెరుగైన ఉజ్వల భవిష్యత్ కలిసి నిర్మించుకుంటే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఇరువురు ప్రతిజ్ఞ చేశారు.
చైనా,మంగోలియా ఇలా కలవడం గత రెండు నెలల లో ఇది రెండవ భేటి కావడం చాలా సంతోషమని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.మా మైత్రి, సంబంధాలు విశ్వ యవనికలో ఓ మార్గం గా ఉంటుందని చైనా అనిలషించింది.