తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రసంత్తరంగా సాగుతోంది.చూస్తుండగానే అప్పుడే 10 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో 11 వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.
అయితే హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ సరిగా ఎంటర్టైన్ చేయడం లేదు అనే బిగ్ బాస్ కి కోపం వచ్చినట్టు ఉంది.అందుకే విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కోత కోయడం మొదలుపెట్టాడు.
అయితే బిగ్ బాస్ ఎప్పుడైతే ప్రైజ్ మనీ నుంచి డబ్బులు కోత కోయడం మొదలు పెట్టాడో అప్పటినుంచి కంటెస్టెంట్ల మధ్య అసలైన గొడవ మొదలైంది.అయితే ప్రస్తుతం కంటెంట్ల మధ్య ఉన్న ఫైర్ చూస్తే ఇదే ఫైర్ ఇంతకుముందు ఉంటే బిగ్ బాస్ కి నిర్ణయం తీసుకునేవాడు కాదు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హౌస్ మేట్స్ చేసిన పనికి బిగ్ బాస్ ప్రైజ్ మనీ ని తగ్గించుకుంటూ పోతున్నాడు.ఇప్పటికే మొన్న కంటెస్టెంట్స్ అందరిపై సీరియస్ అవుతూ ఇష్టం లేని వాళ్ళు బయటికి వెళ్లిపోవచ్చు అంటూ గేట్లు కూడా తెరిచాడు.
ఆ సమయంలో ఒక వారం బాగానే టాస్కులు ఆడి పోరాడిన కంటెస్టెంట్స్ మళ్ళీ యధావిధిగా అలాగే చేయడంతో బిగ్ బాస్ నిన్ననే తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోకి కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది.
ఈ టాస్క్ లో ఇనయ, శ్రీహాన్, ఆదిరెడ్డి, రోహిత్, రేవంత్ పాల్గొన్నారు.ఇనయను గేమ్‌లో అవుట్ చేసేందుకు ప్రయత్నించిన రోహిత్‌ను టైం చూసి దెబ్బ కొట్టాడు ఆదిరెడ్డి.
ఆ తర్వాత శ్రీహాన్, రేవంత్ కలిసి ఆదిరెడ్డిని అవుట్ చేసేందుకు ప్రయత్నించారు.దీంతో ఆది కోపంతో ఊగిపోయాడు.ఇక గేమ్‌లో రేవంత్, ఫైమా మధ్య ఫైట్ జరిగింది.వెటకారం తగ్గించుకుంటే మంచిది, నీలాగా నేను వెటకారం చేస్తే ఏడుస్తావని రేవంత్ చెప్పగా అమ్మో, నాకు భయమైతుంది మరి అని కౌంటరిచ్చింది ఫైమా.
అప్పుడు రేవంత్ ఫైమా మీద సీరియస్ అవుతూ వెటకారం ఎక్కువైంది తగ్గించుకో ఫైమా అని అంటాడు.పక్కనోడు సపోర్ట్ చేస్తే కానీ గేమ్ ఆడలేవు, నువ్వు నాకు చెప్తున్నావా? అని ఆగ్రహించాడు రేవంత్.నువ్వు కూడా సపోర్ట్‌తోనే ఆడుతున్నావు, సొంతగా ఆడలేదని ఫైమా అనడంతో మరింత రెచ్చిపోయాడు రేవంత్.నేను ఎవ్వడి సాయం తీసుకోలేదని కరాఖండిగా చెప్పాడు.
ఈ మాటతో షాకైన ఆదిరెడ్డి వెంటనే మాట్లాడేటప్పుడు బ్రెయిన్ దగ్గర పెట్టుకోని మాట్లాడు ఇంతకుముందే మనిద్దరం ఒక టీమ్ అన్నట్లుగా చెప్పావు.ఇక్కడేమో శ్రీహాన్‌తో కలిసిపోయి ఆడావు.
ఎంతమందితో కలిసి ఆడుతావు? అని విమర్శించాడు.కెప్టెన్సీ టాస్క్‌లో ఓడిపోవడాన్ని ఇనయ జీర్ణించుకోలేక ఏడ్చేసింది.