తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్ ఆసిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ ఆసిన్.
ఈ ముద్దుగుమ్మ మొదట రవితేజ నటించిన అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు ఏర్పరచుకున్న తరువాత వరుసగా తెలుగులో అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది.
ఇకపోతే తెలుగులో ఈ ముద్దుగుమ్మ గజిని, శివమణి, ఘర్షణ వంటి సినిమాలలో నటించిన మెప్పించింది.
అతి తక్కువ సమయంలోనే వరుసగా సినిమా అవకాశాలు అందుకోవడంతోపాటు తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువ అయింది.
అలాగే కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ హిందీ భాషల్లో కూడా నటించి భారీగా క్రేజ్ ని ఏర్పరచుకుంది.ఇకపోతే ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా ఒక రాణిస్తున్న సమయంలోనే 2016లో రాహుల్ శర్మ అనే ఒక బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.
ఇక పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది.

అయితే సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను,ఫోటోలను వీడియోలను పంచుకుంటూనే ఉంటుంది ఆసిన్.ఇది ఇలా ఉంటే తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆసిన్ తాజాగా తన భర్త రాహుల్‌కు కూతురు అరిన్ మేకప్ వేసింది.లిప్‌స్టిక్, ఐ షాడోస్, కాంపాక్ట్ వంటివి చక్కగా వేసింది.
దీనికి సంబంధించిన ఫోటోలను అసిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.ఫోటోలలో ఆసిన్ కూతురు చూడడానికి ఎంతో మీదుగా క్యూట్ గా ఉంది.







