తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) కొలువుదీరి నెల రోజులు గడిచింది.ఈ క్రమంలో నెల రోజుల పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ట్వీట్ చేశారు.
నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందన్న సీఎం రేవంత్ రెడ్డి సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాటను నిలబెట్టుకుంటామని తెలిపారు.పేదల గొంతుక వింటూ యువత భవిష్యత్ కు బాటలు వేస్తామని పేర్కొన్నారు.
పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ.నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ.మత్తులేని చైతన్యపు తెలంగాణ( Telangana ) కోసం గట్టి పట్టుదలతో పోరాడతామన్నారు.రేవంతన్నగా తనను గుండెల్లో పెట్టుకున్నారన్న ఆయన ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా బాధ్యతలను నిర్వర్తిస్తానని ట్విట్టర్ వేదికగా తెలిపారు.