ప్రస్తుత కాలంలో కొందరు బాధ్యతగల విద్య భోధన వృత్తిలో ఉంటూ ఆ వృత్తిని సక్రమంగా నిర్వర్తిస్తూ విద్యార్థులను బంగారు బాటలో నడిపించాల్సి పోయి కామంతో విద్యార్థుల పైనే చెయ్యి వేస్తూ ఉపాధ్యాయుడు అనే మాటకి కళంకం తెస్తున్నారు.తాజాగా ఓ ఉపాధ్యాయుడు తాను పని చేస్తున్నటువంటి పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిని లొంగదీసుకుని తన కామ వాంఛను తీర్చుకున్నటువంటి ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే సిద్ధ రాజు అనే వ్యక్తి స్థానికంగా ఉన్నటువంటి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.ఇతడికి ఇద్దరు భార్యలు కూడా ఉన్నారు.అయితే ఇతడు పని చేస్తున్నటువంటి పాఠశాలలో చదువుకుంటున్నటువంటి అభం శుభం తెలియని ఓ విద్యార్థినిపై కన్నేశాడు.అంతేగాక విద్యార్థినికి మార్కులు ఎరగా వేసి ఆమెని లొంగదీసుకున్నాడు.
అయితే అప్పటి నుంచి ఆమెతో తన కామ వాంఛలు తీర్చుకుంటున్నాడు.అంతేగాక ఆమె చదువు అయిపోయి పాఠశాల వదిలిపెట్టి వెళ్లిపోయినప్పటికీ ఆ విద్యార్థిని వదలకుండా ఇప్పటికీ లైంగికంగా వేధిస్తున్నాడు.
అయితే తాజాగా విద్యార్థిని మరియు సిద్ధరాజు ఏకాంతంగా గడిపిన సమయంలో తీసుకున్నటువంటి ఫోటోలు నెట్ లో ఉన్నట్లుండి ప్రత్యక్షమయ్యాయి.ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి సిద్ధరాజు కంగుతిన్నాడు.
తన భార్య పిల్లలకు ఈ విషయం తెలిస్తే ఎక్కడ పరువు పోతుందోనని ఇల్లు వదిలి పెట్టి పరారయ్యాడు.దీంతో సిద్ధ రాజు భార్య లు వెంటనే ఈ విషయం గూర్చి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించారు.అంతేగాక తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు నమోదు చేశారు.ఫిర్యాదు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు సిద్ధరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
.