సోషల్ మీడియాలో మంచి పనుల పై అవగాహన కల్పించడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది మెగా కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భార్య ఉపాసన.ఇందులోభాగంగా ఇప్పటికే సమాజానికి ఉపయోగపడేటువంటి పలు అంశాలపై కూడా సోషల్ మీడియాలో తన అభిమానులకు అందుబాటులో ఉంటూ పలు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంది.
అంతేగాక సహాయం కోసం తన వద్దకు వస్తే లేదు అనకుండా ఎంతో కొంత సహాయం చేసే మంచి గుణం ఉన్నటువంటి మెగా కోడలు ఉపాసన ఈసారి మరో కొత్త అంశం పై సోషల్ మీడియాలోకి వచ్చింది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంత కలకలం వస్తుందో పెద్దగా చెప్పనవసరం లేదు.
నిన్న మొన్నటి వరకు ఈ కరోనా వైరస్ చైనాకే పరిమితమై ఉండటంతో ఇక్కడే ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు.అయితే ప్రస్తుతం ఈ కరోనా మహమ్మారి భారతదేశంలో కూడా మెల్లమెల్లగా విజృంభిస్తోంది.
అయితే ఈ అంశంపై తాజాగా ఉపాసన కొణిదెల స్పందిస్తూ కరోనా వైరస్ రాకుండా చేపట్టే పలు సూచనలు సలహాలు ఇస్తూ ఇచ్చింది.ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో తరచూ దగ్గు జలుబు జ్వరం వంటి వాటితో బాధపడేవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
అంతేగాక కరోనా వైరస్ ని యాంటీ బయోటిక్స్ తో అంతమొందించలేమని దీనికి నివారణ ఒక్కటే మందు అని అన్నారు.

అలాగే దగ్గు వల్ల ఇబ్బంది పడుతున్న టువంటి వ్యక్తులకు కొంతమేర దూరంగా ఉండాలని సూచించారు.అలాగే జలుబు, జ్వరం, దగ్గు, వంటి వాటితో సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు మాస్కూ ధరిస్తే మేలని ఇలా చేయడం వల్ల ఇతరులకు ఈ లక్షణాలు సోకకుండా ఉంటాయని తెలిపారు.అలాగే చిన్నపాటి ఇన్స్పెక్షన్ వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి వైద్యులను సంప్రదించాలని వైద్యుల సలహా మేరకు మాత్రమే మందులు తీసుకోవాలని లేకపోతే పలు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు.