జనసేన పార్టీలో కమిటీలు నియమించినా ఆ పార్టీ నాయకుల్లో మాత్రం ఉత్సాహం ఎక్కడా కనిపించడంలేదు.అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీగా ఉంటూ రాజకీయాలను పెద్దగా పట్టీనుకోలేనట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఏపీలో ప్రజా సమస్యలు అనేకం ఉన్నా పార్టీ నుంచి స్పందన కనిపించడం లేదు.మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని అధికార పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా మల్చుకుని ఉద్యమాలు, చేస్తూ నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటోంది.
కానీ ఆ పరిస్థితి జనసేనలో కనిపించడం లేదు.ఈ నాలుగేళ్ల పాటు పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలో తెలియని గందరగోళ పరిస్థితుల్లో అధినేత పవన్ ఉన్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతోంది.

బీజేపీతో పొత్తు పెట్టుకుని రాజకీయంగా బలపడదామని చూసినా జనసేన పార్టీతో వ్యవహరిస్తున్న తీరు మింగుడు పడడం లేదు.పైగా బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నాము అనే బాధ జనసేన పార్టీ నాయకుల్లోనూ అధినాయకుడు పవన్ లోనూ ఎక్కువ కనిపిస్తోంది.సొంతంగా ఉద్యమాలు,ప్రజా ఆందోళనలు చేద్దామన్నా కేంద్ర అధికార పార్టీ బిజెపి పర్మిషన్ కావాల్సి రావడం, తమతో కలిసి కార్యక్రమాలు చేసేందుకు బీజేపీ పెద్దగా ఇష్టపడకపోవడం, ఇవన్నీ ఇప్పుడు జనసేన కు ఇబ్బందికరంగా మారాయి.అధినాయకుడు పవన్ కూడా ఇప్పుడు అంటీ ముట్టనట్టుగా వ్యవహారం చేస్తున్నారు.
దీంతో ముందు ముందు రాజకీయంగా ఇబ్బందులు తప్పవని, పార్టీ మనుగడే కష్టమవుతుందని, ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.అసలు జనసేన లో పవన్ కళ్యాణ్ తప్ప మిగతా ఏ ఒక్కరు యాక్టివ్ గా ఉండే పరిస్థితి కనిపించడంలేదు.

ఆ పార్టీ తరఫున వాయిస్ ఏదైనా ప్రకటన చేయాలన్నా ఏ కార్యక్రమంలో పాల్గోవాలన్నా పవన్ ఒక్కరే అన్నే తానై నడిపిస్తున్నారు.దీంతో ఆ పార్టీలో మరో నాయకుడు పవన్ కు ప్రత్యామ్న్యాయంగా కనిపింవ్హాడంలేదు.ఇవన్నీ జనసేనకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.మొత్తం పార్టీ వ్యవహారాలను పవన్ ఒక్కడే చక్కపెడుతున్నారు.మరో నాయకుడు ను తయారు చేసేందుకు కూడా పవన్ ఇష్టపడకపోవడం జనసేనకు ఇబ్బందికరంగా మారింది.ఇటువంటి లోపాలన్నీ సరిదిద్దుకుని, పార్టీ నాయకుల్లో ఉత్సాహం కల్పించాల్సిన పవన్ ఇప్పుడు సినిమాల్లో బిజీగా వ్యవహరిస్తుండడం జనసేన నాయకుల్లో తీవ్ర అసంతృప్తిని రాజేస్తోంది.