వామ్మో స్వరూపానంద.. ఇదేమి కైంకర్యం..!

విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలుసు కదా.ఈయనంటే తెలియని వాళ్లకు కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలిసేలా చేశారు.

ఇద్దరు సీఎంలు ఈయన ఆశీర్వచనాల కోసం పోటీ పడుతుంటారు.ఒంగి ఒంగి దండాలు పెడుతుంటారు.

సరే.అది వాళ్ల వ్యక్తిగత విషయం.అయితే అలాంటి పీఠాధిపతి ఇప్పుడు ఏపీలో చేస్తున్న పని చర్చనీయాంశమైంది.

ఈయన జనవరి 3 నుంచి నెల రోజుల పాటు హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో తన పీఠంలో సభలు నిర్వహిస్తున్నారు.ఇది మంచి పనే.అందులో ఎలాంటి సందేహం లేదు.అయితే వీటి నిర్వహణ కోసం సాయం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి స్వరూపానంద లేఖ రాశారు.

Advertisement

సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఆయన శిష్యుడు.అలాంటప్పుడు ప్రభుత్వమే తోచిన సాయం చేస్తే సరిపోతుంది కదా.

కానీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాత్రం ఆ లేఖను రాష్ట్రంలో ఐదు ప్రముఖ దేవాలయాలకు పంపించారు.ఆయన ఇలా హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు.దానికి మీ వంతు సాయం చేయండంటూ రాష్ట్రంలోని శ్రీశైలం, విజయవాడ, ద్వారకా తిరుమల, సింహాచలం, అన్నవరం దేవాలయాలకు లేఖలు పంపించారు.

అయితే ఈ దేవాలయాలకు భక్తులు ఇచ్చే సొమ్ము అక్కడి దేవుళ్లకు, ఆ దేవాలయాల అభివృద్ధికి వాడాలి కానీ.ఇలా ఓ పీఠానికి ఎలా ఇస్తామంటూ ఈ దేవాలయాల ఈవోలు తలపట్టుకుంటున్నారు.

ఒకవేళ ఇలాంటి కార్యక్రమాలు ఆయా దేవాలయాలే నిర్వహించినా భక్తుల సొమ్మును వాడుకోవచ్చు.కానీ ఆలయం, దేవాదాయ శాఖతో సంబంధం లేని పీఠానికి ఎలా ఇస్తామన్న సందేహం వాళ్లలో నెలకొంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

అయినా ఇలాంటి ధర్మ పరిరక్షణ సభలు విరాళాలతో చేయాలిగానీ.దేవాలయాల నుంచి సొమ్ము అడగడమేంటన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.అయితే సాయం అడిగింది సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి అమితంగా ఆరాధించే వ్యక్తి కావడంతో ఆయా దేవాలయాల అధికారులు కచ్చితంగా నో అని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు