ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో ఏపీ సర్కార్ కు ఊరట లభించింది.ఆయనపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం తో ఏపీ సర్కార్ సుప్రీం కోర్టు లో సవాల్ చేసింది.
దీనితో ఈ కేసు పై విచారించిన సుప్రీం కోర్టు ఆ ఆదేశాలపై స్టే విధిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే మాజీ ఐబీ అధికారి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
అయితే దీనిపై వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించి స్టే కూడా తెచ్చుకున్నారు.అయితే ఈ స్టే ఆర్డర్ ను సుప్రీం కోర్టు లో ఏపీ సర్కార్ సవాల్ చేయడం తో తాజాగా ఏపీ సర్కార్ కు అనుకూలంగా స్టే ఉత్తర్వులను నిలిపివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
దీనిపై విచారించిన జస్టిస్ ఎ.ఎం.ఖాన్ విల్కర్, జస్టిస్ అజయ్ రోస్తగి ధర్మాసనం.హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది.
తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏపీ వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
అయితే ఆసమయంలో ఆయన తన కుమారుడి కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలను కొనుగోలు చేసి, అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ జగన్ సర్కార్ సస్పెండ్ కు గురి చేసింది.

దేశ భద్రతకు ముప్పు కలిగించేలా ఆయన ప్రవర్తించారని ప్రభుత్వం ఆరోపిస్తూ ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడం తో ఏబీ తొలుత క్యాట్ ను ఆశ్రయించగా క్యాట్ కూడా సమర్ధించింది.ఆ తరువాత అదే ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించడం తో హైకోర్టు ఏపీ సర్కార్ ఆదేశాలపై స్టే విధిస్తూ తీర్పు వెల్లడించింది.అయితే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీం ను ఆశ్రయించడం తో ఇప్పుడు తాజాగా సుప్రీం హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ తీర్పు వెల్లడించింది.