బాలకృష్ణతో జతకట్టడానికి సిద్ధమైన శృతిహాసన్.. స్వాగతం పలికిన చిత్రబృందం..!

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాను పూర్తి చేసుకున్న బాలకృష్ణ త్వరలోనే NBK#107 పేరుతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.

 Shruthi Haasan To Teamup With Balakrishna In Next Movie, Balakrishna, Shruthi H-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్నారు.ఇది ఇలా ఉండగా ఇందులో బాలకృష్ణ సరసన నటించడానికి శృతిహాసన్ సిద్ధమయ్యారు.

నిజజీవిత సంఘటనల ఆధారంగా మాస్ యాక్షన్ తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నటించడానికి హీరోయిన్ ఎవరు అనే విషయంలో సందిగ్దత నెలకొన్నప్పటికీ తాజాగా ఈ సినిమాలో శృతిహాసన్ నటిస్తోందని ఆమెకు స్వాగతం పలుకుతూ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఒక పోస్టర్ ను విడుదల చేసారు.

ఇకపోతే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న గోపీచంద్ మలినేనితో శృతిహాసన్ కు మంచి అనుబంధం ఉంది.శృతిహాసన్ కి బాలకృష్ణతో ఇది మొదటి సినిమా అయినప్పటికీ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో తనకు ఇది మూడవ సినిమా.గతంలో గోపీచంద్ దర్శకత్వంలో శృతిహాసన్ బలుపు, క్రాక్ వంటి చిత్రాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది.

మరి ఈ సినిమా తనకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube