కొంతమంది బ్రతికుంటే ఎన్నో మంచి పనులు చేస్తూ అందరి మనసులలో చిరస్థాయిగా నిలిచి పోతుంటారు.మరికొందరు మాత్రం బతికున్న సమయంలో ఎంతో మంచి పనులు చేయటం ద్వారా వారి మరణించినా కూడా చిరంజీవులుగా వర్ధిల్లుతారు.
ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో నటించే నటీనటులు వారు మరణించిన తర్వాత కూడా వారి సినిమాల ద్వారా ప్రేక్షకుల మదిని దోచుకుంటారు.ఇలాంటి కోవకు చెందినదే ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి.
డాక్టర్ చదువు చదివి ఎంతో మందికి సేవ చేయాల్సిన ఈ చిన్నారి,సినిమాలలో నటించే అవకాశం రావడంతో డాక్టర్ చదువు మధ్యలోనే ఆపి సినిమాల వైపు అడుగులు వేసింది.ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటి కేవలం అతి చిన్నవయసులోనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది.
తన మరణించిన ఇప్పటికీ ప్రేక్షకులు తనను ఎంతగానో అభిమానిస్తున్నారు.ఇప్పటికైనా హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.నిజమే ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి అలనాటి తార సౌందర్య.

ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతుండగానే సినిమాలలో అవకాశం రావడం మనవరాలి పెళ్లి ద్వారా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.అయితే సౌందర్య తండ్రి ఒక జ్యోతిష్యులు కావడంతో చిన్నప్పుడే తన ఒక పెద్ద స్టార్ మారుతుందని చెప్పారు.అదే విధంగా తన జీవితంలో ఓ పెద్ద ప్రమాదం జరుగుతుందని తాను ముందుగానే ఊహించాడనే సమాచారం వినబడుతుంది.
మనవరాలి పెళ్లి తర్వాత రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో నటించిన తర్వాత సౌందర్య వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఒకవైపు కమర్షియల్ పాత్రలలో నటిస్తు, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో ఎంతో అద్భుతంగా నటించి తిన్న విజయవంతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకున్న 2004 లో హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య మృతి చెందారు.సినిమాలలో ఒక స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సౌందర్య రెండు సంవత్సరాలకి ఈ లోకాన్ని విడిచి పోయినప్పటికీ ప్రజలందరు ఈమెను ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు.