సాఫ్ట్ వేర్ కంపెనీ బ‌డా మోసం.. ఓ యువ‌తి నుంచి ఏకంగా ల‌క్ష‌ల్లో వ‌సూలు

ప్ర‌స్తుతం ఉన్న స‌మాజంలో మోసాల‌కు కొదువే లేకుండా పోతోంది.టెక్నాల‌జీ ఎంత‌లా పెరుగుతోందో మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి.

 Software Company Fraud Charges In Lakhs From A Young Woman, Software Company Fra-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే కాలానికి త‌గ్గ‌ట్టే మోసాలు కూడా చాలా స్మార్ట్‌గా త‌యార‌వుతున్నాయి.వ్య‌క్తుల నుంచి కంపెనీల వ‌ర‌కు మోసాలు చేయ‌డంలో కొత్త రూట్ ఎంచుకుంటున్నాయి.

ప్ర‌స్తుతం ఓ కంపెనీ ఇదే త‌ర‌హాలో టీనా హ‌న్సెన్ అనే బాధితురాలిని నిండా మోసం చేసింది.ఇక్క‌డ విష‌యం ఏంటంటే ఈ కంపెనీ కూడా మ‌న హైద‌రాబాద్‌కు చెందిన‌దే కావ‌డం గ‌మ‌నార్హం.

హ‌బ్సిగూడ‌లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ త‌మ మొబైల్ యాప్ సాఫ్ట్ వేర్ డెవ‌ల‌ప్ మెంట్ కోసం స‌ద‌రు బాధితురాలితో ఒప్పందం కుదుర్చుకుంది.ఇక ఈ ఒప్పందం ప్ర‌కారం ఆ బాధితురాలు కంపెనీకి దాదాపుగా రూ.10,00,000 వ‌ర‌కు చెల్లించింది.అయితే డ‌బ్బులు క‌ట్టించుకున్న త‌ర్వాత ఆ కంపెనీ బాధితురాలిని ప‌క్క‌న పెట్టేసింది.దీంతో ఆమె మోసపోయాన‌ని గ్ర‌హించి న్యాయ‌పోరాటానికి దిగింది.ఇందులో భాగంగా అడ్వ‌కేట్ రాధిక‌ను ఓ ఛాన‌ల్ ద్వారా స‌ద‌రు బాధితురాలు ఆశ్ర‌యించింది.ఆ కంపెనీ నుంచి త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరింది.ఇక లాయ‌ర్ రాధిక ఎంతో బాధ్య‌త‌తో ఆమెకు న్యాయం చేయ‌డానికి పోరాడుతోంది.

ఆమెకు ఎలాగైనా న్యాయం చేయాల‌ని లాయ‌ర్ రాధిక స్వ‌యంగా వాదిస్తోంది.ఎలాగైనా ఆ కంపెనీ నుంచి టీనా హ‌న్సెస్‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇప్పించి న్యాయం చేస్తాన‌ని రాధిక చెప్తోంది.

టీనా హ‌న్సెస్‌కు జ‌రిగిన‌ట్లు మ‌రెవ‌రూ కూడా ఇలాంటి కంపెనీల‌ను న‌మ్మి మోస‌పోవ‌ద్దంటూ రాధిక సూచిస్తున్నారు.ఇలాంటి ఘ‌ట‌న‌లు చూసిన‌ప్పుడైనా ఇత‌రులు మోస‌పోకుండా ఉండాల‌ని ఆమె కోరుతున్నారు.కాగా ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వివరాలలో టీనా హ‌న్సెస్ మోసం చేసిన‌ట్టు తప్పుడు ప్రచురించటం జరిగింది , 15-8-2021 రోజున రాసిన ఆర్టిక‌ల్‌కు తెలుగు స్టాప్‌.కామ్ త‌ర‌ఫున రాధిక గారికి & టీనా హ‌న్సెస్‌ గారికి క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube