స్మార్ట్ దొంగ.. కార్లలోని వస్తువులను ఇట్టే చోరీ చేస్తాడు

ఇటీవల కాలంలో చోరీలు ఎక్కువైపోయాయి.ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.దొంగలు స్మార్ట్‌గా తమ నైపుణ్యంతో ఎంచక్కా దోచేస్తున్నారు.ఏ చిన్న వస్తువుతోనో చోరీ చేస్తూ పోలీసులను పరుగులు పెట్టిస్తున్నారు.తాజాగా ఓ దొంగ చేసిన పనికి పోలీసులకే మతిపోయింది.

 Smart Thief Steals Items From Cars Details, Smart Thief, Viral Video, Rubber Ban-TeluguStop.com

చోరీలు చెయ్యడంలో ఈ దొంగ స్టయిలే వేరు.

అతడి చేతిలో ఒక రబ్బరు బ్యాండ్‌ ఉంటే చాలు.తన స్మార్ట్ నైపుణ్యంతో కార్లలోని వస్తువులను ఇట్టే చోరీ చేయడంలో సిద్ధహస్తుడు.

మాములుగా దొంగలు కత్తులు, టూల్ కిట్లను ఆయుధాలుగా వాడితే.ఇతను మాత్రం కేవలం రబ్బరు బ్యాండ్‌తో ఈజీగా దొంగతనం చేస్తాడు.

హెయిర్ పిన్‌కి రబ్బర్ బ్యాండ్‌ కట్టి, మరోవైపు చాక్లెట్ కవరును కడుతున్నాడు.ఇలాంటి దాన్ని కొందరు పిట్టలను కొట్టడానికి వాడుతుంటారు.

ఆ చాక్లెట్ కవరులో సన్నని రాయి ఉంచి వెనక్కి లాగుతాడు.అనంతరం రాయిని కారు అద్దానికి బలంగా తగిలేలా వదులుతాడు.

దీంతో కారు అద్దం వెంటనే పగిలిపోతుంది.దీంతో కారులో ఉండే విలువైన వస్తువులతో అక్కడి నుంచి ఉడాయిస్తాడు.

చాక్లెట్ కవర్‌లో సన్న రాయి కారణంగా అది కారు అద్దానికి తగిలినా శబ్దం పెద్దగా వినబడదు.దీంతో అతని చోరీ మూడు రబ్బరు బ్యాండ్లు.

ఆరు చాక్లెట్ కవర్లలా సాగింది.అయితే ఎన్ని చోరీలు చేసినా ఎప్పుడోసారి పోలీసులకు చిక్కడం సహజం.

ఇలా దొరికిన దొంగ కటకటాలపాలయ్యాడు.ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

అయితే అతను చోరీలకు పాల్పడుతున్న విధానం గురించి విని మొదట్లో పోలీసులు నమ్మలేదు.అయితే వారి ఎదురుగానే రబ్బర్ బ్యాండ్‌తో కార్ల అద్దాలు పగలగొట్టి చూపించడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు.

ఇందుకు సంబంధించిన వీడియోని IPS ఆఫీసర్ రుపిన్ శర్మ… తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.“పార్క్ చేసిన కార్లలో విలువైన వస్తువులు ఉంచకండి.రబ్బర్ బ్యాండ్‌తో గ్లాస్ పగలగొట్టగల దొంగలు ఉన్నారు.తమిళనాడులో ఇది జరిగింది” అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు.ప్రజలను అప్రమత్తం చేయడానికే ఈ వీడియో పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.దీంతో కారు యజమానులు జాగ్రత్తగా ఉండాలని.

కారు లాక్ చేశామని.అందులోని వస్తువులు భద్రంగా ఉన్నాయి అనుకుంటే పొరపాటుపడినట్లేనని.

విలువైన వస్తువులను తమ వెంట తీసుకువెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.

ప్రజలను అప్రమత్తం చెయ్యడానికే పోలీసులు ఈ విషయాన్ని మీడియా ముందుంచారు.

సో… కార్ పార్క్ చేసి.లాక్ వేసినంత మాత్రాన అది సేఫ్‌గా ఉంటుందనీ, అందులోని వస్తువులు సురక్షితంగా ఉంటాయని గ్యారంటీ లేదు.

అందుకే ఎంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది.ప్రస్తుతం ఈ ఖతర్నాక్ దొంగ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube