ఆత్మహత్యాయత్నం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. బిగ్ బాస్ ఏం చేశాడంటే?

తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఆదరణ పొందిన రియాలిటీ షోగా బిగ్ బాస్ షోకు పేరుంది.తెలుగులో ప్రస్తుతం బిగ్ బాస్ షో సీజన్ 5 ప్రసారమవుతుండగా హిందీలో బిగ్ బాస్ సీజన్ 15 ప్రసారమవుతోంది.

 Singer Afsana Khan Evicted From Bigg Boss 15 After Hurt Itself With Knife Detai-TeluguStop.com

అయితే బిగ్ బాస్ సీజన్ 15లో ఒక కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేశారు.టాస్క్ లో ఓడిపోవడంతో తనను తాను కత్తితో పొడుచుకోవడానికి కంటెస్టెంట్ ప్రయత్నించగా బిగ్ బాస్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు.

బిగ్ బాస్ సీజన్ 15కు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఈ షోలో అఫ్సానా ఖాన్ కంటెస్టెంట్ గా ఉన్నారు.ఈ టాస్క్ లో ఓటమిపాలైన అఫ్సానా ఖాన్ మానసికంగా సంయమనం కోల్పోయారు.అఫ్సానా ఖాన్ కత్తితో తనను తాను పొడుచుకోవడానికి ప్రయత్నించడంతో బిగ్ బాస్ అమెను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు.

అఫ్సానా ఖాన్ తరచూ షమితా శెట్టితో గొడవ పడటం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

షమితా శెట్టిపై తరచూ భౌతిక దాడులకు పాల్పడటం వల్ల కూడా అఫ్సానా ఖాన్ ను హౌస్ నుంచి బయటకు పంపించాలని నిర్ణయం తీసుకున్నానని బిగ్ బాస్ చెప్పడం గమనార్హం.

Telugu Afsana Khan, Afsanakhan, Bigg Boss, Knife, Hindi Bigg Boss, Physical, Sha

వీఐపీ యాక్సెస్ టాస్క్ వల్ల అప్షానా ఖాన్ షాక్ కు గురి కావడం గమనార్హం.ఈరోజు రాత్రి అప్షానా ఖాన్ ఎలిమినేషన్ గురించి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.బుధవారం రాత్రి ఎపిసోడ్ లో ఎలిమినేషన్ గురించి స్పష్టత రానుంది.

Telugu Afsana Khan, Afsanakhan, Bigg Boss, Knife, Hindi Bigg Boss, Physical, Sha

మరోవైపు బిగ్ బాస్ షో గురించి కొంతమంది నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.నటిగా, సింగర్ గా గుర్తింపు సంపాదించుకున్న అఫ్సానా ఖాన్ ఎలిమినేట్ అయిందని వస్తున్న వార్తలతో ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube