సత్యం సినిమా తో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన రాజేష్ ఆ సినిమా తో సత్యం రాజేష్ ( Satyam Rajesh ) గా పేరు సంపాదించుకున్నాడు…ఇక ఆయన ఈ మధ్య రూట్ మార్చి కామెడీ క్యారెక్టర్లు కాకుండా డిఫరెంట్ రోల్స్ చేస్తూ చాలా వేరియేషన్స్ చూపిస్తున్నాడు అందులో భాగంగా వచ్చిన సినిమానే పొలిమేర…ఈ సినిమాలో సత్యం రాజేష్ ప్రధాన పాత్ర (మాంత్రికుడు)లో నటించాడు.మా ఊరి పొలిమేర’ టైటిల్‌తో ఓ చిత్రం ఓటీటీలో విడుదలై మంచి ఆదరణను రాబట్టుకున్న విషయం తెలిసిందే… ఆ చిత్ర ఎండింగ్లో ఇచ్చిన ట్విస్ట్‌తో సీక్వెల్‌పై ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేశారు.
కానీ ఆ సినిమా వచ్చి చాలా కాలం అవుతుండటంతో.సీక్వెల్‌పై ఒత్తిడి మొదలైంది.
అసలు సీక్వెల్ చేస్తున్నారా? లేదా? అనే అనుమానాలకు తాజాగా మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా.
డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘మా ఊరి పొలిమేర -2′ ( Maa Oori Polimera 2 ).
సత్యం రాజేష్, డా.కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, అక్షత, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్( Talasani Srinivas Yadav ) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.పోస్టర్ విడుదల అనంతరం తలసాని మాట్లాడుతూ.
‘మా ఊరి పొలిమేర -2’ పోస్టర్ చాలా బాగుంది.ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు అని తెలిపారు.
సందర్భంగా చిత్ర దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్ ( Dr.Anil Viswanath ) మాట్లాడుతూ.‘మా ఊరి పొలిమేర-2’ ఫస్ట్‌లుక్‌ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌గారు విడుదల చేయడం చాలా పాజిటివ్‌గా అనిపించింది.
ఇది ఒక బ్లెస్సింగ్‌లా ఫీల్ అవుతున్నాం.‘మా ఊరి పొలిమేర’ చిత్రాన్ని ప్రేక్షకులందరూ బాగా ఆదరించారు.
ఈ చిత్రానికి సీక్వెల్ ఉందా.లేదా? అని చాలా మంది అడుగుతున్నారు.ఈ ప్రశ్నకి సమాధానంగా ‘మా ఊరి పొలిమేర -2’ ఫస్ట్ లుక్ లాంఛ్ చేయడం జరిగింది.
ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే నిర్మాత గౌరికృష్ణ వెల్లడిస్తారని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ.అందరం ఒక ఫ్యామిలీలాగా ఈ చిత్రాన్ని కంప్లీట్ చేశాం.
దర్శకుడు ‘మా ఊరి పొలిమేర’ను మించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది.
త్వరలోనే టీజర్ కూడా రిలీజ్ చేస్తాము.తలసానిగారికి ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు…
నటుడు సత్యం రాజేశ్ మాట్లాడుతూ.గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ‘మా ఊరి పొలిమేర’ చిత్రాన్ని ఎంతో ఆదరించారు.దానికి సీక్వెల్‌గా వస్తున్న మా ఊరి పొలిమేర 2 త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.
ఈ చిత్రాన్నికూడా అదే విధంగా ఆదరిస్తారని నమ్ముతున్నాం.దర్శకుడు సీక్వెల్‌ని అద్భుతంగా తెరకెక్కించారు.
నిర్మాత గౌరికృష్ణ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారని తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమంలో డీఓపీ ఖుషేందర్ రమేష్ రెడ్డి కూడా పాల్గొన్నారు…
.