ట్రైలర్‌ టాక్ : ఫుల్‌ ఎంటర్ టైన్‌మెంట్‌ను ఇవ్వబోతున్న 'స్కైలాబ్‌'

1980 ల్లో భూమి మీదకు స్కైలాబ్‌ పడబోతుంది.దాని వల్ల భూమి మొత్తం నాశనం అవుతుంది.

 Satyadev Nithya Menen Skylab Movie Trailer,latest Tollywood News-TeluguStop.com

అది ఎక్కడ పడ్డా కూడా అక్కడి వారు చనిపోతారు అంటూ ఏవో ఏవో పుకార్లు వచ్చాయి.స్కైలాబ్ అనే అంతరిక్ష కేంద్రంకు చేందిన ఒక నౌక గురించిన చర్చ దాదాపు ఒక ఏడాది పాటు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగింది.

ఆ సమయంలో ఎక్కడ చూసినా కూడా అదే చర్చ.ఎవరి నోట విన్నా కూడా అదే వ్యవహారం.

అలాంటి ఒక టాపిక్ తో సినిమా అంటే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్‌ విషయం.విభిన్న చిత్రాలను ఎంపిక చేసుకుని నటించే హీరో సత్యదేవ్‌ ఈసారి స్కైలాబ్‌ కాన్సెప్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

పీరియాడిక్ సినిమా అంటే భారీ బడ్జెట్‌ అవుతుంది.ప్రతీది అప్పటి కాలంకు తగ్గట్లుగా చూపించాల్సి ఉంటుంది.

అందుకోసం భారీగా ఖర్చు చేయాల్సిందే.స్కైలాబ్‌ ట్రైలర్ చూస్తుంటే నిర్మాతలు బాగానే భారీగా ఖర్చు చేశారని తెలిసి పోతుంది.

ఇక కథ విషయానికి వస్తే హీరో సత్యదేవ్ ఒక ఆర్ ఎం పీ డాక్టర్ గా కనిపించబోతున్నాడు.ఆయన తన వద్దకు పేషంట్స్ ఎక్కువ రావాలని కోరుకుంటూ ఉంటారు.

ఇక నిత్యామీనన్‌ ఒక వార్త పత్రికకు విలేకరి.సంచలన కథనం రాయాలని ఆమె ఆశ పడుతూ ఉంటుంది.

అలాంటి వారి జీవితంలో స్కైలాబ్‌ సంఘటన ఎలాంటి పరిణామాలకు దారి తీసింది అనేది ఈ సినిమా కథగా ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది.

కాన్సెప్ట్‌ చాలా సీరియస్ విషయం అయినా కూడా చాలా కామెడీగా తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది.అప్పుడు సీరియస్ గా పరిణామాలు ఉన్నా కూడా ఇప్పుడు తల్చుకుంటే చాలా ఫన్నీగానే అవి ఉంటాయి.కనుక అదే విషయాన్ని మేకర్స్‌ చూపించబోతున్నారు.

చాలా చిత్ర విచిత్రమైన సంఘటనలు స్కైలాబ్‌ పడబోతున్నట్లుగా ప్రచారం జరిగిన సమయంలో జరిగాయి.ఆ తర్వాత ఎలాగూ బతికి ఉండము కనుక ఇష్టానుసారంగా కొందరు వ్యవహరించిన తీరు కూడా ఈ సినిమాలో ఫన్నీగా చూపించబోతున్నారు.

స్కైలాబ్‌ ప్రమాదం తప్పిన తర్వాత వారు ఏం చేశారు అనేది కూడా ఫన్నీగా సినిమాలో చూపిస్తారేమో చూడాలి.మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే సినిమా చాలా చాలా ఎంటర్‌ టైన్ మెంట్‌ ను అందించడం ఖాయం అనిపిస్తుంది.

మొదటి సారి సత్యదేవ్ మరియు నిత్యామీనన్ లు కలిసి నటించారు.ఈ సినిమాకు విశ్వక్ కందేరావు దర్శకత్వం వహించాడు.

ప్రశాంత్ ఆర్ విహారి ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.రాహుల్‌ రామకృష్ణ మరియు సత్యదేవ్ ల మద్య ఉండే కామెడీ ఆకట్టుకుంటుందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube