టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కలిసి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాటపర్వం.ఈ సినిమా జూన్ 17న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వరుస ప్రొమోషన్స్ చేస్తూ టీమ్ అంతా బిజీ బిజీగా ఉంది.
ఈ క్రమంలోనే సాయి పల్లవి కూడా వరుస ఇంటర్వ్యూలు చేస్తూ ఈ సినిమాకు బూస్టప్ ఇస్తుంది.
సాయి పల్లవి పేరు చెబితే చాలు ఫ్యాన్స్ కు పూనకాలు వస్తున్నాయి.
ఈమెకు యూత్ లో భారీ క్రేజ్ ఉంది.ఎక్కువ అందాల ఆరబోత చేయకపోయినా ఈమె అంటే అందరు ఇష్టపడుతున్నారు.
ఇక ఈమె డ్యాన్స్ కోసం అయితే ప్రేక్షకులకు ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాయి.తాజాగా ఈమె నటించిన విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.
సాయి పల్లవి క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈమెకు ఒక బిరుదు ఇచ్చిన విషయం తెలిసిందే.ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఈమె గెస్ట్ గా పాల్గొంది.
ఏమిటో పాటు సుకుమార్ కూడా ఆ ఈవెంట్ కు వచ్చారు.ఆ క్రమంలోనే ఈమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా సుకుమార్ ఈమెను ఏకంగా లేడీ పవర్ స్టార్ అని సంబోదించి అందరికి షాక్ ఇచ్చారు.
అయితే ఈమెకు ఆ బిరుదు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు అని ప్రేక్షకులు సైతం సపోర్ట్ చేయడంతో సాయి పల్లవికి లేడీ పవర్ స్టార్ అనే బిరుదు వచ్చింది.అయితే ఈమెకు వచ్చిన ఈ బిరుదుపై తాజాగా ఇంటర్వ్యూలో ఈమె స్పందించింది.తనని లేడీ పవర్ స్టార్ అంటూ ఎవరైనా పిలిస్తే నాకే కొంచెం అతిగా అనిపిస్తుంది అని నిజానికి అలా పిలుపించు కోవడం ఇష్టం లేదని.నేనిక్కడ అందరితో గౌరవంగా పనిచేయడానికి మాత్రమే వచ్చానని.
స్టార్ డమ్ చూసి వచ్చే వాళ్ళ కోసం కాదని ఆమె చెప్పుకొచ్చింది.ఈమె మాటలు విన్న తర్వాత ఈమెపై మరింత అభిమానం చూపిస్తున్నారు ఫ్యాన్స్.
మరి విరాటపర్వం సినిమాతో ఎలా ఆకట్టు కుంటుందో వేచి చూడాల్సిందే.