వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల తెరకెక్కించిన చిత్రం ‘మర్డర్’.మిర్యాలగూడెంలో జరిగిన పరువు హత్య ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందిన విషయం తెల్సిందే.
అమృత మారుతిరావుల కథ నేపథ్యంలో రూపొందిన మర్డర్ చిత్రాన్ని విడుదల చేసేందుకు రెడీ అవుతున్న సమయంలో వర్మ పై అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది.నల్లగొండ పోలీసుల వద్ద ఈ వివాదం ఉంది.
ఈ కేసు విచారణలో భాగంగా వర్మ నల్లగొండ పోలీసుల ముందు హాజరు అవ్వాల్సి ఉండగా ఆయన హాజరు కాలేదు.
వర్మకు కరోనా వచ్చిందని అందుకే మీకు సమాధానం ఇవ్వలేక పోయాడు అంటూ వర్మ తరపు న్యాయవాది పోలీసులకు తెలియజేశాడు.
అమృత కేసులో వర్మను పోలీసులు ప్రశ్నించేందుకు ప్రయత్నించగా ఆయన దొరకలేదు.అందుకు కూడా కరోనా కారణం అంటూ లాయర్ అన్నాడు.అయితే రామ్ గోపాల్ వర్మ తాజాగా ట్విట్టర్‌లో అసలు తనకు కరోనా లేదని క్లారిటీ ఇచ్చాడు.తనకు అనారోగ్య సమస్యలు లేవని ఇలాంటి పుకార్లు నమ్మవద్దంటూ చెప్పడంతో పోలీసుల ముందు ఆయన లాయర్ చెప్పింది అబద్దమా అంటూ ప్రశ్నిస్తున్నారు.

నిజంగానే పోలీసుల వద్ద రామ్ గోపాల్ వర్మ తరపు లాయర్ అబద్దం చెప్పి ఉంటే లాయర్‌తో పాటు వర్మకు కూడా కఠిన శిక్ష తప్పదంటూ పోలీసు వర్గాల వారు అంటున్నారు.వర్మకు కరోనా వచ్చింది లేనిది క్లారిటీ కావాలంటూ పోలీసులు వెయిట్ చేస్తున్నారు.అమృత వేసిన పిటీషన్‌తో మర్డర్ సినిమా విడుదల కొన్ని రోజుల వరకు ఆగిపోయే అవకాశం ఉంది.వర్మ ఎలా అయినా ఆ సినిమాను విడుదల చేయడం ఖాయం అంటున్నారు.