రేర్ మెడికల్ కండిషన్‌: ఆ పాప, ఇక జీవితంలో ఏడవలేదట?

అవును మీరు విన్నది నిజమే.ఇక ఆ పాప జీవితంలో ఏడవలేదట.

బాధకలిగినా కూడా ఏడుపు ద్వారా ఆ బాధను వ్యక్తపరచలేదట.ఎందుకంటే శాశ్వతమైన నవ్వుముఖంతో ఉండటమే ఈ బాలికకు పెద్ద సమస్యగా మారిపోయింది.

మన శ్రేయోభిలాషులు మనల్ని ఎప్పుడూ నవ్వుతు ఉండమని దీవిస్తుంటారు.కానీ ఇదే సాధ్యమయ్యే పని కాదు.

కాలానుగుణంగా ఏడుపు వచ్చినా, బాధ వచ్చినా మనసారా ముఖంపై ఆ భావాలను వ్యక్తీకరించగలగాలి.అప్పుడే ఇతరులకు మన భావాలు అర్థం అవుతాయి.

అయితే ఆ భావాలను బయట పెట్టే సామర్థ్యం ముఖ భాగాలకు లేకపోతే అది ఒక శాపంగా పరిగణించాలి.

ఇపుడు ఇలాంటి ఓ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది ఆ చిన్నారి. అందరూ నోటితో చేసే పనులను ఈ పసిబిడ్డ సక్రమంగా చేయలేక నానాతంటాలు పడుతోంది.‘Permanent Smile’ కండిషన్‌తో పుట్టిన ఈ ఆస్ట్రేలియన్ పాప ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.ఈ చిన్నారి గురించి తెలుసుకున్న నెటిజన్లు అయ్యో పాపం అని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.అరుదైన మెడికల్ కండిషన్‌తో బాధపడుతున్న ఈ చిన్నారి పేరు ఐలా సమ్మర్ ముచ్చా.

ఈ మెడికల్ కండిషన్‌ గురించి అవగాహన కల్పించడానికి, పెంచుకోవడానికి తల్లిదండ్రులు సోషల్ మీడియాను వేదికగా ఉపయోగిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే, ఐలా డిసెంబర్ 2021లో బైలేటరల్ మాక్రోస్టోమియాతో జన్మించింది.

బైలేటరల్ మాక్రోస్టోమియా అనగా ఏమిటంటే, శిశువు కడుపులో ఉన్నప్పుడే నోటి చివర భాగాలు సరిగ్గా కలవని ఒక మెడికల్ కండిషన్‌ అన్నమాట.అంటే నోటి చివరి భాగాలు కట్ చేసినట్టుగా, పెదాలు సాగి సాగిపోయినట్టుగా కనిపించడం వల్ల పాప ఎప్పుడూ నవ్వుతున్నట్టుగానే కనిపిస్తుంది.

దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన ఐలా తల్లిదండ్రులు, క్రిస్టినా వెర్చర్ (21), బ్లైజ్ ముచా (20) ఈ విషయం గురించి తెలుసుకున్నప్పుడు షాక్ అయ్యారు.తరువాత పాప ఆపరేషన్ కొరకు స్థోమత లేక సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube