ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రణబీర్ కపూర్ అలియాభట్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అన్న విషయం తెలిసిందే.ఇద్దరు కూడా ఎవరికివారు సొంతంగా స్టార్లుగా ఎదిగిన తరువాత చివరికి ప్రేమ వివాహం చేసుకున్నారు అని చెప్పాలి.
ఎన్నో ఏళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఏప్రిల్ 14వ తేదీన పెళ్లితో ఒక్కటయ్యారు.మరికొన్ని రోజుల్లో తల్లిదండ్రులు కూడా కాబోతున్నారు అన్న విషయం తెలిసిందే.
అంతేకాక తన తాతయ్య రాజ్ కపూర్ కట్టించిన కృష్ణ రాజ్ అనే అతి పెద్ద బంగళాలో ఆలియా భట్ తో కలిసి కాపురం పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నాడు రణబీర్ కపూర్.
ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతూ ఉన్నారు అని చెప్పాలి.
ఇక ఇటీవల బ్రహ్మాస్త్ర అనే సినిమాలో రియల్ కపుల్ కాస్త రీల్ కపుల్ గా కూడా నటించారు.అయితే ఇక ఇప్పుడు ఈ క్రేజీ జంట గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఆలియా భట్ ని పెళ్లి చేసుకోవడం కారణంగా ఇప్పుడు రణబీర్ కపూర్ కష్టనష్టాలను అనుభవిస్తున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది.అదేంటి ఆలియా భట్ ఇండియాలోనే టాప్ హీరోయిన్లలో ఒకరు.100ల కోట్ల ఆస్తి కూడా ఉంది.రణబీర్ కపూర్ కి కూడా ఆస్తి ఏం తక్కువ లేదు.
మరి ఇంక కష్టనష్టాలు ఎందుకు అని అనుకుంటున్నారు కదా.
రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో రణబీర్ తల్లి నీతూ కపూర్ ఇలా ఫీలవుతూ ఉందట.ఆమె జాతకాలు గ్రహాలు వంటివి ఎక్కువగా నమ్ముతారట.కాగా రణబీర్, ఆలియా జాతకం అస్సలు కలవలేదట.
పెళ్లి విషయంలో కూడా ఆమె పెద్దగా ఇష్టపడలేదట.రణబీర్ కపూర్ జాతకానికి కలిసివచ్చే అమ్మాయిని పెళ్లి చేయాలని అనుకున్నారట.
కానీ రణబీర్ కపూర్ తల్లి మాటలు వినకుండా ఆలియాభట్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు.దీంతో రణబీర్ కష్టాలకు ఆలియా భట్ కారణం అంటూ తన సన్నిహితుల దగ్గర చెబుతుందట నీతూ కపూర్.