బాబోయ్‌ మళ్లీ మహేష్ బాబుతో త్రివిక్రమ్‌ ప్రయోగం.. అవసరమా గురూజీ?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందబోతున్న సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు తాజాగా ప్రారంభం అయ్యాయి.మొదట సినిమా కు సంబంధించిన టెస్ట్ షూట్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, అది పూర్తయిన వెంటనే రామోజీ ఫిలిం సిటీలో రెగ్యులర్ షూటింగ్ జరగబోతుంది అంటూ మరో వార్త వస్తుంది.

 Mahesh Babu And Trivikram Movie Ssmb 28 Update Details, Mahesh Babu, Trivikram ,-TeluguStop.com

ఆ విషయం పక్కన బెడితే తాజాగా సినిమా షూటింగ్ ప్రారంభం అయింది అంటూ దర్శకుడు త్రివిక్రమ్ ఒక వీడియో ని విడుదల చేసిన విషయం తెలిసిందే.ఆ వీడియోలో మహేష్ బాబు ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా హింట్ ఇచ్చారు.

ఆ విషయమై ప్రస్తుతం సోషల్ మీడియా లో ఆసక్తి చర్చ జరుగుతుంది.మహేష్ బాబు పోలీస్ గా నటించిన సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.

కానీ మహేష్ బాబు పోలీస్ అనగానే చాలా మంది అభిమానులు ఆగడు సినిమా ఫలితాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

ఆ సినిమా చాలా దారుణమైన పరాజయాన్ని మూట కట్టుకున్న విషయం తెలిసిందే.

ఆ సినిమా తర్వాత మహేష్ బాబు అస్సలు పోలీస్ పాత్ర చేయవద్దు అని అభిమానులు కోరుకుంటున్నారు.అలాంటిది ఇప్పుడు త్రివిక్రమ్ మళ్ళీ మహేష్ బాబుకి పోలీస్ డ్రెస్ వేయాలని భావించడంతో సూపర్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Telugu Maheh Babu Role, Mahesh Babu, Maheshbabu, Telugu, Ssmb, Trivikram-Movie

ఇలాంటి సమయంలో మహేష్ బాబు కెరియర్ మళ్లీ ఇబ్బందుల్లో పడకుండా మీరే చూడాలి ఆయనకు సక్సెస్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.కానీ మీరు పోలీస్ డ్రెస్ లో మహేష్ ని చూపించి మళ్లీ ప్రయోగం చేయాలనుకుంటున్నారు.ఆ ప్రయోగం వికటిస్తే అభిమానులు తీవ్రంగా నిరాశపడుతారు.అప్పుడు మీకు విమర్శలు తప్పవు అంటూ ముందుగానే త్రివిక్రం ను కొందరు హెచ్చరిస్తున్నారు.మరి మహేష్ బాబుకి త్రివిక్రమ్ ఎలాంటి సినిమాను ఇస్తాడో చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube